ఐకమత్యంతో-విజయం సాధించవచ్చు.;- డా.బెల్లంకొండనాగేశ్వరరావు.చెన్నయ్.
 అవంతి రాజ్యానికి మూడు పక్కలా పెద్ద పర్వతశ్రేణులు రక్షణగా ఉండేవి. ఒక్కతూర్పు దిక్కునమాత్రమే రాజ్యంలోనికి ఎవరు రావాలన్నా అరణ్య మార్గన మాత్రమే రాకపోకలు సాగించాలి.
అవంతిని రత్నశేఖరుడు అనే రాజు పరిపాలిస్తుంండేవాడు.అతనిమంత్రి పేరు సుబుధ్ధి. తన ప్రజలకు ఉచిత పధకాలను ప్రవేశపెట్టి సోమరులుగా తయారు చేయడమే కాకుండా ,తాను రాజభోగవిలాసాలకు అలవాటుపడి రాజ్యపాలన చేయడంలో నిర్లక్యంగా వ్యవహరించేవాడు. పరిస్ధితులు గురించి ఎన్నిసార్లు మంత్రిచెప్పినా,రాజు పెడచెవిన పెట్టేవాడు.తెసిన సాటిరాజులవద్ద అప్పులు తెచ్చి ప్రభుత్వాన్ని నడపలేక వృధ్ధుడైన మంత్రి రాజ్యభారం మోయలేక సతమతం అయ్యేవాడు.దీనికితోడు గతరెండు సంవత్సరాలు వర్షలులేక అవంతి రాజ్యంలో కరువు సంభవించింది.రాజ ఉద్యోగులకు జీతాలు కూడా చెల్లించలేనిపరిస్ధితి.అప్పటికే కొంతమంది సైనికులు పనివదలి వెళ్ళిపోయారు.
రాజ్య ఆర్ధిక పరిస్ధితి రాజుకు వివరిస్తూ,రాజ్యభారం తనవల్లకాదలి చెప్పిన మంత్రి ఉచిత పధకాలు ఆపివేయమని సలహాయిచ్చాడు. "మంత్రివర్యా నేనంటే రాజునుకనుక బాధ్యతకలి నాప్రవర్తనలో మార్పు తెచ్చుకుంటాను. ప్రజలకు ఆఅవసరం ఏముంది,వాళ్ళకు ఉచితపధకాలు ఆపితే తిరగబడే ప్రమాదంఉంది. ఇప్పుడు ఉన్నపరిస్ధితులలో మనకు అప్పుఇచ్చే రాజ్యంకూడా లేదు.కనుక మనం అత్యవసరంగా ధనం వచ్చేమార్గం ఆలోచించాలి అంటూ,మన రాజ్యంలోని అరణ్యంలో పలు భాగాలలో నివశిస్తున్న అటవీతెగజాతి నాయకులతో ఎల్లుండి అమావస్యరోజు మన వసంతమంటపంలో సమావేశం ఏర్పాటు చేయించండి"అన్నాడు రత్నశేఖరుడు. మంత్రి రాజుగారు చెప్పినట్లు దాదాపు ముఫైమంది అటవీజాతి తెగ నాయకులతో సమావేశం ఏర్పాటు చేసాడు. ఆసమావేశంలో...
కోయలు,సవరులు,బోయలు,అబోర్స్,అవతామీలు,బడగాలు,బైగాలు,భోటియాలు,బిర్హారులు,చెంచులు,చూటియాలు,గడ్డీలు,గల్లంగులు,గారోలు,
గోండులు, జరవాలు,ఖాసులు,ఖాశీలు,ఖోండులు,మోదలగు అటవీ జాతి నాయకులు  పాల్గొన్నారు.సమావేశానికివచ్చిన రత్నశేఖరుడు "పలుతెగల నాయకులారా మీరు మారాజ్యపరీధిలోని అరణ్యంలో నివసిస్తున్నారుకనుక,నేటినుండి ఏడాదికి ఇంత అనిసుంకం చెల్లించాలి. కాదాని ఏగూడెం వాళ్ళఇనా ఎదురుతిరిగితే మాఆగ్రహానికి, మేము తీసుకునే చర్యలకు బాధ్యులు అవుతారు"అన్నాడు"
ఆగిరిజన సమూహానికి నాయకత్వం వహిస్తున్న కోయల నాయకుడు సింగన్న"మారాజా మేము మీకు ఎందుకు సుంకం చెల్లించాలి.ఏనాడైనా మీరు కాని, మీరుపంపిన వాళ్ళుకాని మాగురించి విచారించారా? మీప్రజలకు ఉచితాలపేరున ఉన్నదంతా దోచిపెట్టి ఈరోజు మమ్ములను సుంకంచెల్లించమనడం ఏమిన్యాయం? సుఖః మీప్రజలకు,కష్టం మాకా? అడవిబిడ్డలం ఎవ్వరికి బానిసలంకాము.సుంకం చెల్లించం ఇదే మానిర్ణయం".అన్నాడు.
"ఎంతపోగరు మహారాజునే ధిక్కరిస్తావా?"అన్నాడు అక్కడ ఉన్న సేనాధిపతి."ఆగుస్వామి ఆయనగారు మీకురాజు,మాకుకాదు అనిమరిచిపోతున్నారు"అన్నాడు సింగన్న.
"ఎంతధైర్యం వచ్చేపున్నమి రోజే ముందునీగూడెంపై దాడిచేస్తాను. అప్పుడుకాని మిగిలినవారికి బుద్ధిరాదు"అన్నాడు రాజు.
"ఓదొర సింగన్నగూడెంపై మీరు దాడిచేసిచూడండి మాసత్తా ఏమిటో తెలుస్తుంది.మేమంతా సింగన్న వెనుకే ఉంటాం.మాసింగన్నదోర గూడెందాపులకుకూడా మీరురాలేరు"అన్నాడు చెంచుల నాయకుడు.
"సరే అదీచూద్దాం"అటూ సమావేశంనుండి వెళ్ళిపోయాడు రాజు.
పౌర్ణమికి రెండురోజులముందే అన్నితెగల మగ,ఆడవారు తమ ఆయుధాలతో సింగంన్న గూడెంలో సమావేశం అయ్యారు.
"సింగన్నదొర న్యాయంకోసం,ఆశయంకోసం పోరాటంచేసేటోళ్ళం మనం. ధనంకోసం రాజు,అతనుఇచ్చే జీతానికి పనిచేసేటోళ్ళు సైనికులు. ఆశయంకోసం పోరాటంవేరు,జీతం కోసం పోరాడటంవేరు.యుధ్ధమొదలైన కొద్దిసేపట్లో విజయభేరిమోగించి నీకు శుభవార్త అందిస్తా"అన్నాడు చెంచునాయకుడు.
యుధ్ధం ప్రారంభమైన కొద్దిసేపటికే,గిరిజనులతో పోరాడలేక,వెనుతిరిగాడు రత్నశేఖరుడు.వారిఐకమత్యమే విజయానికి మార్గమని, తనపతనానికి మూలం తనఉచిత పధకాలేనని గ్రహించాడు రత్నశేఖరుడు.

కామెంట్‌లు