శబ్ద సంస్కృతి! అచ్యుతుని రాజ్యశ్రీ
 

పురోహితుడు అంటే పురానికి హితం చేసేవాడు అని అర్ధం. ఐతరేయ బ్రాహ్మణంలో  కేవలం బ్రాహ్మణులనే పురోహితులు అనేవారు. పురోధ అనికూడా అనేవారు. కులవిప్రుడని పిల్చేవారు.వశిష్ఠ విశ్వామిత్రులు సుదాసు అనేరాజుకి పురోహితులు గా ఉన్నారు అని చెప్పబడింది. పురోహితుడు అనేది ఒక పదవి.ఎంతోమంది రాజులకి ఒకేఒక పురోహితుడు ఉండేవాడు. వంశపారంపర్యంగా కులవృత్తి చేస్తూ యజ్ఞకార్యాల్లో భాగం పంచుకునేవారు.న్యాయ నిర్ణయాలు  సార్వత్రిక కార్యాల్లోఇతనిది ప్రధాన పాత్ర. 
రాష్ట్రకూట్ రాఠౌర్ రాజరికంని సూచించే శబ్దం! రాఠౌడ్ ల ప్రాచీన నివాసం కనౌజ్.జోధ్పూర్  రాఠౌర్ వంశం చాలా ప్రాచీనమైనది.వీరు ఇంద్రుడి వెన్నెముక *రహట్) నించి ఉత్పన్నం ఐనారు అని ఓకథనం! వీరి కులదేవత రాఠాణీ రాఠేశ్వరి.జోధ్పూర్ వాసుల్లో100కిపైగా శాఖలున్నాయి.జోధా చాంపవత్ రూపావత్ మొదలైనవి ముఖ్యమైనవి. ఎల్లోరాలలోని కైలాస గుహనిరాష్ట్రకూటరాజు 3వ కృష్ణ రాజు నిర్మించాడు. మాన్యఖేట్ మాల్ ఖేడ్ ప్రసిద్ధ వంశాలు.సీతారాముల కొడుకు కుశుడి వంశీయులని కొందరి వాదన 🌷.
కామెంట్‌లు