మీరు ఎక్కడున్నా, మీరు భారతీయులైనా, హిందువులైనా, వేరేమతస్తులైనా, మీరు ఇంకేదైనా, సనాతన ధర్మం అందరికీ వర్తిస్తుంది, ఎందుకంటే ఈ నియమాలు మన ప్రాథమిక జీవ ప్రక్రియకు మార్గదర్శకాలు. ఏ సంస్కృతీ కూడా దీనివైపు, మనం చూసినంత లోతుగా చూడలేదు అని సద్గురు జగ్గీ వాసుదేవ్ ఒక ప్రవచనంలో సనాతన ధర్మం యొక్క విశిష్టత గురించి అద్భుతంగా చెప్పారు.
సనాతనధర్మం వలన సమాజంలో సౌభ్రాతృత్వం, సహకారం, సమభావం వెల్లివిరుస్తాయి. ప్రతి ఒక్కరి హృదయం శాంతి తో నిండి వుంటుంది. సనాతన ధర్మంలో అందరూ శాంత స్వభావికులే అయ్యి కోపం, అసూయ, పగ, ప్రతీకారం, ధన వ్యామోహం, కామం, మోహం వంటి దుర్గుణాలకు దూరంగా ఉండాలి.మన హిందూ సాంప్రదాయం, మన హిందూ ధర్మ విశిష్టత, సనాతన ధర్మంలో ప్రధాన సూత్రాలను మనం ప్రతినిత్యం పాటించాలి. మన ప్రాచీన సంస్కృతికి నిదర్శనం హిందూ ధర్మమైతే సనాతన ధర్మం చరిత్ర సంస్కృతికి ప్రతిరూపం అని ఆధ్యాత్మిక వేత్తలు అభిప్రాయపడుతున్నారు. పవిత్రమైన వేదములలో సైతం సనాతన ధర్మం యొక్క విశిష్టత గురించి వివరించడం జరిగింది. ఇందులో భాగంగా మానవుడు భూతదయ కలిగి వుండడం, దానధర్మాములు చేయుటలో ఆసక్తి కలిగి వుండదం. అహింసా పరమో ధర్మః అన్న సిద్ధాంతం తప్పకుండా పాటించండి ,నా అన్న స్వార్థానికి స్వస్తి పలుకుతూ ఇతరులపట్ల దయాగుణం కలిగి ఉండడం కొన్ని ముఖ్యమైన అంశాలు.. మానవునికి సంతోషకర జీవనానికి సనాతన దర్మం ఉత్తమం.
సనాతన ధర్మం;- :సి.హెచ్.ప్రతాప్
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి