పల్లవి :-
కప్పుకున్న మంచుదుప్పటి తొ లగించి చూసింది భూదేవి .. !
చల చల్లని పిల్ల తెమ్మెరలు...
లేలేత కిరణాలనుముద్దాడగా తుషారబిందువులు..,పులకించి,అద్దుకున్నఆనందపురంగుల హంగులతోపుడమిఅందాలను ఒలకబోసింది ... !
చరణం :-
నునువెచ్చని ఆ రవికిరణా లు చెట్లకొమ్మలనుండి జాలువా రుతూ... నేల కాన్వాసు పై రేఖా చిత్రాలెన్నో చిత్రిస్తున్నై .... !
అరవిరిసిన సుమముల చు ట్టూ భ్రమరమొకటి ఝుమ్మన్న
సమ్మోహన మంత్రం తో ప్రదక్షి ణలు చేస్తోంది.... !!
"కప్పుమున్న మంచు... "
చరణం :-
ప్రకృతి సోయగాలను తిలకించిన పురుషునిలో....
ఆనంద పరవశం కవిత్వమై పొంగి పొర్లి, భావ లలిత గీతముగా రూపుదాల్చినది
భావలలిత గీతముగా రూపు దాల్చినదీ.... !!
*******
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి