నకులుడు; - కొప్పరపు తాయారు
 ఒకరోజు ద్రౌపదీ దేవి నకులుడు సాయంత్రంగా వ్యాహాళికి బయలు దేరారు ఇక్కడ నకులుడు ఎవరో
చెప్పాలి, పాండవులు గురించి అందరికీ తెలిసిందే.
ధర్మరాజు,భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు.ఇప్పుడు నకులుడు ఎవరో తెలిసింది
కదా.అతని గురించి మనం ఇప్పుడు తెలుసు కుందాము.
           అలా వారిద్దరూ వెళుతూ ఉంటే ఆకాశం మేఘావృతం అయింది అప్పుడు నకులుడు అన్నాడు. ఇప్పుడు వర్షం పడుతుంది నేను ఆ వర్షంలో ఒక్క చినుకు కూడా నా మీద పడకుండా చినుకు చినుకు మధ్యలో నుంచి అశ్వం మీద  తిరిగి నీ వద్దకు వస్తాను అన్నాడు.ద్రౌపదికి కొంచెం ఆశ్చర్యం
కలిగించినా పైకి ఏమీ మాట్లాడక. ఇది ఎలా సాధ్యము అని అమాయకంగా అడిగింది. ఆ విన్యాసాన్ని చూపించమని అడిగింది.
          అంతే వాన మొదలవుతుంటే అశ్వం మీద  చాకచక్యంగా మొత్తం ఆ ప్రదేశం అంతా తిరిగి తడవకుండా చక్కని ప్రతిభతో దౌపది దగ్గరికి వచ్చాడు.తడిసి పోలేదు.
ద్రౌపది తడిసిపోకుండా వచ్చిన నకులుడిని, అభి
నందించింది సంతోషం తో.
          ఇదే చతురత మహాభారత యుద్ధంలో నకులుడు, అశ్వత్థామ తో యుద్ధం చేసినప్పుడు
ఒక్క  బాణం తగలకుండా తప్పించుకొని యుద్ధ నైపుణ్యం చూపితే. వారి గురువు ఇంక తప్పక ఈ యుద్ధంలో విజయం పాండవులు దేనని నిశ్చయించుకున్నాడు. అంతటి గొప్ప అశ్వ శాస్త్రం తెలిసినవాడు నకులుడు

కామెంట్‌లు