* ఆనందంగా బ్రతికేదము *; - కోరాడ నరసింహా రావు !
 మా పెరటికి వెళదాము రండి 
   పిల్లలు... ! 
  పండ్ల చెట్లెన్నో చూద్దాము... 
  పదండి పిల్లలూ... !! 
   
   ఎన్నెన్నో  పండ్లచెట్లు ఉన్నవి 
      మా పెరటిలోనె... !!
జామ,బొప్పాయి,సీతాఫలము 
  మామిడి,సపోటా...దానిమ్మ !
    వీటితో పాటు, పూల మొక్క లెన్నొ ఉన్నవి... !
    
దోర జామకాయలు, పలక     బారిన, బొప్పాయి పండ్లు..!
  దానిమ్మ, సపోటాలు....సీతా ఫలాలు.... !
   ఈ పండ్లన్నీ...బలే రుచిగ     ఉంటాయి.. !
అపుడే కోసిన... తాజా పళ్ళు 
 తింటుంటాము  ఎపుడు    
.... మేమందరం  !
మా పెరటిలోని 
           ఈ చెట్లన్నీ... ఏనాడో మా తాతనాటిన
            మొక్కలట... !
   మీరూ ...  మీ పెరళ్ళలో... 
 పండ్లమొక్కలను చక్కగ  నాటండి..., 
      మేము మాతాతనుగొప్పగా  
  చెప్పునటుల... 
మీ పిల్లల పిల్లలు...
మనుమళ్ళూ...మనుమరాళ్లు 
 గొప్పగా మిమ్ములనూ... తలచు కొందురు... !
  
 ప్రతిఒక్కరమూ... మొక్కలు 
    నాటుదాము .. 
పర్యావరణాన్ని కాపాడుదాము హాయిని ఎంతో పొందుతు... . ఆనందంగా అందరమూ... 
     బ్రతుకు దాము..... !!
   *******

కామెంట్‌లు