గురు శిష్యులు!!!;- సునీతా -ప్రతాప్.ఉపాధ్యాయిని, పిఎస్ నంది వడ్డేమాన్ నాగర్ కర్నూల్ జిల్లా.
గురువులో-విద్యార్థి
విద్యను మాత్రమే చూడాలి!!
వ్యక్తిగత అధ్యయనం
అవసరం లేదు!!
అదే సంపూర్ణ విద్యకు స్ఫూర్తి
విద్యార్థికి ఆదర్శం!!

గురువు విద్యార్థి ఇద్దరూ
ఒకరికొకరు ఆదర్శమయ్యెందుకే
విద్యార్థులు
ఈరోజు గురువులు అయ్యేది!!!

విశ్వంలో విడిగా ఏ పదార్థం లేదు
ఒకదాన్ని ఒకటి ఆకర్షించుకుంటేనే
ఎక్కడి పదార్థం అక్కడే ఉంటుంది !!
లేదంటే శూన్యంలోకి 
విసిరివేయబడుతుంది!!?

సరిగ్గా అలాగే
గురు శిష్యులు కూడా
ఎవరు విడివిడిగా ఉండలేరు !!
విద్యతో
ఒకరినొకరు ఆకర్షించుకుంటూనే ఉండాలి!!
అప్పుడే
గురు శిష్యులు ఉండాల్సిన చోట ఉంటారు!!

అందుకే
శిష్యులు గురువులైతే
గురుత్వాకర్షణ గురించి తెలుస్తుంది!!?

ఆలోచనలు అల్లకల్లోలంగా
అందరికీ వస్తు పోతూనే ఉంటాయి!!
ఆ ఆలోచనలకు
సృజనాత్మకతతో ఒక రూపం ఇచ్చి
ఒక దీపం వెలిగించేవాడే
గురువు శిష్యుడు!!

విద్యార్థికి గురువుకు
సృజనాత్మకతే  -ఆత్మ!!?

అది అర్థం చేసుకునేందుకే
విద్యార్థినీ విద్యార్థులు
ఈరోజు గురువుల

య్యేది!!?

విద్యార్థులు ఉపాధ్యాయులయ్యే సందర్భాన్ని పురస్కరించుకుని
Sunita Pratap teacher palem nagarkurnool dist 🙏
8309529273
కామెంట్‌లు