అక్కన్న మాదన్నలు:-
ఎడతెగని బంధము గలవారు.
దీనికొక చిన్న ఇతిహాసం కలదు. అక్కన్న మహా మేధావి. గోల్కొండ నవాబు వద్ద మంత్రిగా పనిచేశాడు. ఆ నవాబు వద్ద మాదన్న సేనాపతిగా పనిచేశాడు. ఇతడు మహావీరుడు. వీరిద్దరూ ఒకే రాజు కొలువులో ఉన్నారు. వీరిద్దరి మైత్రి బంధము దృఢముగా ఉండేది. ఒకరిలో ఒకరు ఒదిగి మెదిలేవారు. వారు జీవితాంతం ఆ విధంగానే మైత్రి బంధంలో ఉన్నారు.
అక్కన్న మాదన్నలా బంధము సమాజ శ్రేయస్సుకు ఉపయోగపడింది. పురాణాలలో కూడా కొన్ని కొన్ని ఇట్టి బంధాలు ఉన్నాయి. కానీ అవి సమాజ శ్రేయస్సుకు పనికిరానివి కాబట్టి ఆ జంటలను జాతీయాలుగా వాడుకోలేదు.
ఎవరైనా ఇద్దరు కలిసి జంట కవుల వలె కనిపిస్తే వారిని అక్కన్న మాదన్నలు అనడం వాడుక లోనికి వచ్చినది.
శ్రీరామ సుగ్రీవులు, కృష్ణ కుచేలులు, వీరి మైత్రి కూడా లోకములో కనిపిస్తుంది కానీ జాతీయాలుగా రూపొందలేదు.
జర సంధ శిశుపాలుడు, కర్ణ దుర్యోధనులు-ఇలాంటివి ఎన్నో కలవు. కానీ అవి జాతీయాలు కాలేదు. ఒక జాతీయం కావటానికి సర్వకాలీన సమాజ శ్రేయము ఆ మాటల్లో నిలిచి ఉండాలి. వాడుకలోనికి వస్తేనే అది జాతీయ మవుతుంది. అక్కన్న మాదన్నలు తెలుగువారు చరిత్ర పురుషులు-తెలుగు వారందరికీ తెలిసిన వారు కాబట్టి వారి జంట జాతీయంగా మారింది.
తెలుగు జాతీయం.;- తాటి కోల పద్మావతి గుంటూరు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి