ఉమా:-1
ఓ!మహిళా!శిరోమణిగ*
నోర్పును,నేర్పునుకూర్చెధాతయే!
ప్రేమపిపాసితాప్రకృతి*
ప్రీతిని పంచుననేక రూపముల్!
ఆమని! పంచభూతమయ*
మధ్భుత సంగమజీవకోటికిన్!
నేమిత సత్పథాంగనగ*
నిర్మిత కర్మసుధర్మ పాలినీ!
శా-2
సామ్రాజ్ఞిత్వపరాత్పరావృతపు సం*
సారాంగసారాంశమై!
ధర్మాధర్మవిచక్షణావసుమతీ*
ధైర్యాంశ సంశోభితా!
నిర్మాణాత్మక జీవజాతికిసదా*
నీరేజపత్రేక్షణీ!
శర్మమ్మున్నిడుస్నిగ్థబింబసుఖదా*
సౌహార్ద్ర సారాత్మికా!
మత్తేభం:-3
కరుణాసాగరకాంతికాంతరమణీ*
కాలోచితామూర్తిగా!
నరనారాయణనాట్యగానరవళీ*
నారీపరాదేవతా!
తరుణీక్షీరదమాతృకావతరణీ*
తత్వార్థతాదాత్మికా!
పురుషాధిక్యసమీరవిశ్వవనితా*
పూర్ణత్వబింబాననీ!
చం.మా:-4
కరుణకటాక్షవీక్షణల*
గామిగ విశ్వవిరాళవ్యాపినీ!
నిరతముశాంతిపర్వముల*
నిక్కమునీక్షితికక్షయమ్ముగా!
తరగనిరీతిగానొసగు*
తత్వవిచారితహర్షశోభకృత్!
తరుణిగవచ్చువర్షమున*
ధార్మిక కర్మపరాంగనామణీ!
కం:-5
భువి మువురమ్మలపాలన
కవిరసమయకాంతవాణి*
కాలాంగనగా!
సువిధా!ధనలక్ష్మీకరి
జవసత్వజగాధినేత్రి*
జైజీవాత్మా!
సీసం:-6
ఉత్పల,చంపక*
ముత్సవ మాలలు!
శార్దూలమత్తేభ*
సమసుమాలు!
సత్పథ ఛంధస్సు*
సౌరగుమత్తుతో!
కందపుపుష్పముల్*
గ్రంధమాల!
శోభించు దండలున్*
శోభాయమానమౌ!
శోభకృత్తునవర్ష*
శుభప్రదమ్ము!
మహిలోనిమహిళలు*
మహిమాన్వితమ్ముగా!
మారుతు మార్పును*
మనకు పంచు!
తే.గీ
మహిళ మహిలోన సగమను*
మాట నిజము!
మార్పు తేవాలి మహిమతో*
మానవతన!
మాంద్య దూరిగా సత్పథ*
మార్గదర్శి!
విశ్వజననిగా విజ్ఞాన*
వేల్పువగుచు!
ఆ.వె:-7
ఆయురారోగ్యమైశ్వర్య*
మవని మహిళ!
తల్లి,తనయగ,నత్తగా*
ధర్మ కర్త!
భార్య,బంధువు,ప్రకృతీ*
పంచు ప్రేమ!
నిత్యమాంచద్రతాతార్క*
సత్యమూర్తి!
కం:-8*
జయహోజయజయమహిళా!
జయహో!జనమాతృకాంశ*
జయజయజయహో!
జయమంగళకరరూపిణి
జయమొసగుముకాళిమాత*
జయజగదాంబా!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి