ఉషోదయపు రవికిరణాలతో
ఎన్నెన్నో వర్ణాలు...
కన్నులపండుగ చేస్తుంటే..,
రసహృదయం ఉప్పొంగి...
భావగీతాలు ఆలపించదా.. !
మనసులోని భావాలకు...
ప్రతీకలీ రంగులుకాదా... !
త్యాగానికి కాషాయం...
స్వచ్ఛతకు తెల్లదనం...
విజయానికి ఆకుపచ్చ..
గగనంలో రెప - రెప లాడే మన జాతీయ పతాకానికి
సంకేతము లివే కదా .... !!
ప్రకృతిలో వర్ణాలు.....
మనిషి మనసుకు....
దర్పణ ప్రతి బింబాలు !
.
శివుడు కామదహనమొనరించి
కోరికలను జయింఛమని....
ఇచ్చిన సందేశానికి...
ఆనందపు హేల...
ఈ రంగులకేళి... హోలీ.. !
సప్తవర్ణ సమ్మిళితం...
ఈ మనిషి జీవితం... !
సమయానికి తగు వర్ణముతో
శోభిల్లు చుండు కదా...
శుభములు కోరే పసుపు...
పైరులలో పచ్చదనం....
అన్యాయాలను
ఎదిరించే ఎరుపు
దుఃఖానికి ప్రతిరూపం నలుపు
మన ముఖ కావలికల...
రంగులె చెప్పును...
మన మనసులోని భావాలను
. కాదని అన్నా.. లేదనుకున్నా
చెప్పకనే చెప్పును రంగులు !
హొలీ రోజున ఆడే...
ఈ రంగుల ఆటలు....,
బ్రతుకుకు తప్పని
స్థితి, గతులే యని...
తెలుసుకొనుము సోదరా.. !
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి