బాలల ధీమా!;- -గద్వాల సోమన్న ,ఎమ్మిగనూరు
గుండెను గుడిగా మలచెదం
నిండు మదితో కొలిచెదం
వెండి వెన్నెల రీతిలో
మెండుగ మేలు చేసెదం

పెద్దల మాటలు వినెదం
బుద్ధిగ బడికి వెళ్లెదం
హద్దులు మీరక ఉండెదం
సుద్దులు చాలా చెప్పెదం

చదువులెన్నో చదివెదం
విలువలు కల్గి బ్రతికెదం
చేపల స్ఫూర్తిని తీసుకుని
గెలుపు బాట పయనించెదం

దేశకీర్తిని చాటెడం
దేశభక్తిని చూపెదం
దేశమాత సేవలోన
అహర్నిశలు తరించెదం


కామెంట్‌లు