పట్టువదలని విక్రమార్కుడు చెట్టుపైనున్న బేతాళుని బంధించి భుజాన వేసుకుని మౌనంగా నడవసాగాడు.
విక్రమార్కుని భుజంపై ఉన్న బేతాళుడు"మహీపాలా నీ పట్టుదల చూస్తుంటే ముచ్చటగా ఉంది.అమత సాహాస పరాక్రమ వంతుడవు. నీవు ఇతిహాసం, ఆగమం,కావ్యం,అలంకారం ,నాటకం,గాయకత్వం, కవిత్వం, కామ శాస్త్రం,దురోదరం,దేశభాషా లిపి పరిజ్ఞానం,లిపికర్మం,వాచకం, అవధానం,సర్వశాస్త్రం,శాకునం,సాముద్రికం,రత్నశాస్త్రం,రథాశ్వగజకౌశలం,మల్లశాస్త్రం,సూదకర్మం,దోహదం,గంధవాదం,ధాతువాదం,ఖనివాధం,రసవాధం,జలవాదం,అగ్నిస్తంభం,ఖడ్గస్తంభం,జలస్తంభం,వాక్సంభం,వయస్త్సంభం,వశ్యం,ఆకర్షణం,మోహనం,విద్వేషణం,ఉఛ్ఛాటనం,మారణం,కాలవచనం,పరకాయప్రవేశం,పాదుకాసిధ్ధి,వాక్సిధ్ధి,ఘటికాసిధ్ధి,ఐంద్రజాలకం,అంజనం,దృష్టివంచనం,స్వరవంచనం,మణిమంత్రౌషదాది సిధ్ధి,చోరకర్మం, చిత్రక్రియ,లోహక్రియ,అశ్మక్రియ,మృత్క్రియ,దారుక్రియ,వేణుక్రియ,అంబరక్రియ,అదృశ్యకరణం,దూతీకరణం,మృగయ,వాణిజ్యం,పాశుపాల్యం,కృషి,ఆసవకర్మం,ప్రాణిద్యూతకౌశలం వంటి అరువదినాలుగు కళా విశారదుడవు అయిన నీవు చాలా కాలంగా ఉన్న నా సందేహానికి సమాధానం చెప్పాలి. సీతా దేవి శ్రీరామచంద్రుని యుధ్ధం చూసిందట ఎప్పుడు శ్రీరామచంద్రుడు ఎవరితో యుధ్ధం చేస్తుంటే చూసిందో చెప్పగలవా? ఆయుధ్ధం ఎవరితో ఎలాజరిగింది విపులంగా వివరించు.తెలిసి సమాధానం చెప్పక పోయావో నీతలపగిలి మరణిస్తావు"అన్నాడు.
"బేతాళా!అరణ్యవాస సమయంలో శ్రీరాముడు సీతా లక్ష్మణ సమేతుడిగా దండకారణ్యంలో ప్రవేసించి,తొలుత శరభంగుడు,మందకర్ణ మహరుషుల ఆశీర్వాదాలు పొంది.అగస్త్య మహర్షి ఆశ్రమంలో ఆతిధ్యం పొంది ఆయన ఇచ్చిన వైష్ణవ తేజస్సు కలిగిన ధనస్సు,అక్షయతుణీరాన్ని,యుధ్ధ సమయంలో గాయపడకుండా,అలసట లేకుండా ఉండేందుకు ఆదిత్యహృదయము ఉపదేశంపొంది ఆయన సూచన మేరకు అయిదు మర్రి వృక్షాలు ఒకటిగా ఉన్న పంచవటి అనే ప్రాంతంలో పర్ణశాల నిర్మించుకుని ఉండగా,ఒకరోజు ఖరుని చెల్లెలు శూర్పణఖ లక్ష్మణుని చే అవమానింపబడి ఖరునికి తెలిపి విలపించింది.
తన పధ్నాలుగు వేల రాక్షస వీరులతో రామలక్ష్మణులతో యుధ్ధానికి తలపడ్డాడు ఖర ధూషణాదులు.
"దేవి సీతా విశ్వామిత్ర మహర్షి ఇచ్చిన బల-అతిబల విద్యలు,దివ్య అస్త్రాలతోపాటూ,వశిష్ట,అగస్త్య,సూర్యుడు,దేవేంద్రుడు,పరమేశ్వరుడు వంటి వారి ద్వారా పొందిన దండ,చక్ర,ధరచక్ర,కాలచక్ర,విష్ణుచక్ర షేషిక,పెంద్ర,వజ్ర, ఆగ్నేయ,వాయవ్య,వారుణాస్త్రాలు వంటి ఎన్నో మహిమాన్విత దివ్య అస్త్రాలు ప్రయోగించి ఈ రాక్షసులను సంహరించబోతున్నాను. నయనానందకరమైన నాయుధ్ధాన్ని చూడండి" అంటూ,రాక్షలులు ప్రయోగించే గధా,మోదకం,శూలం వంటి ఆయుధాలను ఆకాశంలోనే తుంచసాగాడు శ్రీరాముడు.
ఆభీకరసమరం చూడటానికి వచ్చిన దేవగణం నార వస్త్రాలు ధరించిన అరుణ ముఖ జ్వాలా శోభితుడై నశ్రీరాముని చూసి శిరస్సు వంచి నమస్కరించారు. సవ్యసాచి అయిన శ్రీరాముని శరపరంపరల ధాటికి రణస్ధలమంతా తెగిన కవచాలు,విరిగినధనస్సులు,విరజిమ్మబడిన అలంకారభూషణాలు,రత్నఖచిత,మణి మాణిక్యాలు పొదిగిన కిరిటాలు, ముక్కలైన దానవుల శరీరాలు రాసులుగా పడిఉన్నాయి.
వికసిత విస్మయ నేత్రాలతో సీతాదేవి,అన్నగారి యుధ్ధ కౌశలాన్ని చూసి లక్ష్మణుడు ఆనందించసాగారు.
సర్వసేనాని ధూషణుడు హుంకరిస్తూ రామునిపై తన బలమైన రాక్షస మాయలు ప్రయోగించాడు.చిరునవ్వుతో శ్రీరాముడు గాంధర్వాస్త్రం ప్రయోగించాడు.రాక్షసమాయలన్ని పటాపంచలైనాయి.మరో దివ్యాస్త్రంతో ఏక కాలంలో ధూషణుని, సారధిని,అశ్వాలను నేలకూల్చాడు.అనంతరం మహాపాలక,స్ధూలాక్ష,ప్రమాది,శ్యీనగామి,పృథుగ్రీవుడు,విహాంగముడు,
దుర్ఖయుడు,కరవీరాక్షుడు,పురుషుడు,కాలకర్ముడు,హేమాలి,మహామాలి,సర్వస్యుడు,రుధిరాశనుడు,యజ్ధశత్రువు,త్రిశరుడు వంటి వీరులతో ఖరుడు రాముని ఎదుర్కోన్నాడు.ఇంద్రదత్తస్త్రాన్ని ప్రయోగించి శ్రీరాముడు వారందరికి సునాయాస మరణాన్ని ప్రసాదించాడు.అలా దండకారణ్యం ఖర ధూషణాదుల మరణం తో విముక్తి పొందింది.సీతాదేవి శ్రీరాముని వీర శౌర్య ప్రతాపాలను కన్నులారా వీక్షించి పరవశించింది.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి