సుప్రభాత కవిత ; - బృంద
తెలి వెలుగుల వెల్లువలో
జలతారంచు జరీచీర కట్టిన
జలపాతాలు గలగలమని
నవ్వుతూ....సాగిపోతుండగా

పచ్చనాకుల తోరణాలతో
విచ్చిన సుమగంధాలతో
పసిడి వెలుగుల ధూపాలతో
పక్షుల కిలకిల మంత్రాలతో

తెరతీసిన గగనంలో 
తూరుపు దీపం అగుపించగా
కిరణాల సోపానముపై
కాంతి దేవత అలవోకగా

అవనికి దిగివస్తుంటే
తొలిసంధ్యారుణ దీపమాలికలు
దేదీప్యముగా ప్రజ్వలింప

మధూదయ శుభవేళ
మరందగానాల మృదంగనాదాలు
మంగళకరముగ  మ్రోయుచుండ
పులకించిన పుడమి పాడే

🌸🌸 సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు