ఆహారం! అచ్యుతుని రాజ్యశ్రీ

 ఒకప్పుడు మంచి పవిత్ర భావాలతో శుచి శుభ్రతతో వంట చేసి వడ్డించేవారు.పైగా దైవస్మరణతో చేయటంవల్ల వంటకిరుచి మాత్రమే కాదు తిన్నవారిలో మంచి ఉదాత్త భావాలు అంకురించేవి.
వటవృక్షంకింద బోధిసత్వుడు కూచున్నాడు. ఒక యువతి  పంచభక్ష్యపరమాన్నాలతో ఘుమఘుమ లాడే వంటకాలు ఆయన ముందు పెట్టి  దర్పం డాబ్సరిగా"తినండి స్వామీ!" అంది."అమ్మా!నాకు ఆకలిగా లేదు. మన్నించు.తీసుకుని వెళ్లు"అనగానే కాస్త మొహం చిట్లించి వెంటనే వెళ్లి పోయింది. కాసేపటికి ఓపల్లెపడుచు తాను తినే ముతక రొట్టె మిర్చి పచ్చడితో వచ్చి వినయంగా "స్వామీ! ఇది స్వీకరించి నన్ను ధన్యురాలిని చేయండి " అని చేతులు జోడించి నిలబడింది. ఆయన ఆప్యాయంగా తిన్నాక వెళ్లి పోయింది. సౌభద్రుడనే శిష్యుడు అడిగాడు "భన్తే!మొదటి ఆమెతో ఆకలిలేదని చెప్పారు. ఈమె తెచ్చిన పచ్చడితో రొట్టె తిన్నారేంటి?""అవును నాయనా!మొదటి ఆమె  అహంకారం డాంబికాలు ప్రదర్శించింది. అశ్రద్ధగా వండి వడ్డిస్తే అది విషంతో సమానం!రెండోఆమె భక్తి ప్రేమశ్రద్ధతో వండి తెచ్చింది." చూశారా! ఇతరులకు పెట్టేటప్పుడు  ఆనందంగా  ఉండాలి. 🌹
కామెంట్‌లు
Popular posts
చిత్రాలు ; ..జ్యోతి టీచర్ వివేకానంద కాన్వెంట్ హైస్కూల్ భారత్ నగర్ (మూసాపేట)- హైదరాబాద్
చిత్రం
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
దగ్గు , ఆయాసం,పిల్లి కూతలు - నివారణ ------------------------------------------------------- పిల్లల్లో జలుబు, దగ్గు, ఎక్కువైనప్పుడు ఊపిరి తిత్తుల్లోని శ్వాస మార్గాలు ముడుచుకు పోయినప్పుడు శ్వాస వదులుతున్నప్పుడు శబ్దం వస్తే దాన్ని పిల్లి కూతలు అంటారు. దీనికి ఉబ్బసం కూడా ఒక కారణం కావచ్చు. వైరస్ బాక్టీరియా , కారణంగా శ్లేష్మపు పొరలు వాచిపోతాయి. దాని వల్ల గురక వస్తుంది కఫం వాలా జ్వరం కూడా రావచ్చు. చిటికెడు పిప్పళ్ల చూర్ణంలో తేనే వెచ్చని నీటిలో కలిపి తాగిస్తే కఫ జ్వరం తగ్గిపోతుంది పిప్పళ్ల పొడిని పాలతో కలిపి తాగిస్తే ఉబ్బసం తగ్గి పోతుంది. పిప్పళ్ల పొడితో బెల్లం కలిపి తినిపిస్తే దగ్గు, ఉబ్బసం తో పాటు రక్తహీనత కూడా నివారించ వచ్చు. - పి . కమలాకర్ రావు
చిత్రం
చిత్రాలు ; జి.జీవనజ్యోతి టీచర్ వివేకానంద కాన్వెంట్ హైస్కూల్ భరత్ నగర్ హైదరాబాద్
చిత్రం
తెలివితేటలు!! ప్రతాప్ కౌటిళ్యా
చిత్రం