విద్య అంటే చదువు రాయడం చదవటంకాదు.దేశ ప్రగతికి కులమత ప్రాంత భేదాలు లేక అందరూ విద్యావంతులు కావాల్సిందే! ఈమాట అన్నది ఆచరణలో చూపింది ఎవరో తెలుసా?
టీచర్ పాఠం చెప్తూ ఓప్రశ్న అడిగింది "పిల్లలూ! రేపు ఓకొత్త మహాపురుషుడి జీవితచరిత్ర గూర్చి చెప్పాలి.కేరళ కి చెందిన వ్యక్తుల గూర్చి చదువుకుని రండి." ఆమర్నాడు మీనన్ అనే అబ్బాయి లేచి"టీచర్! మానాన్న నారాయణగురు ని గూర్చి చెప్పారు. రవీంద్రనాథ్ టాగోర్ గాంధీజీ స్వయంగా వెళ్లి ఆయన్ని కలిశారు. ఆయన సంస్కృత పండితుడు. జాతిమీమాంస అనే తనపుస్తకంలో ఇలా రాశారు.మనుషులంతా సమానం.ప్రపంచప్రజలందరిదీ ఒకేధర్మం! ఒకసారి ఆయన ఎడ్ల బండి ఎక్కారు. బండీవాడు ఎడ్లను చావబాదుతుంటే వెంటనే బండి దిగి ఇరవైమైళ్ళు కాలినడకనే తన గమ్యం చేరారు.దూడని పాలు తాగనీయకుండా మొత్తం పాలుపితికి తనకు ఇచ్చిన పాలామె పాలు తాగకుండా ఉపోషం ఉన్నారు. ఒకసారి ఆయన శిష్యుడు పూజామందిరంలో ఉన్న దైవపటాలకి నారాయణగురు తైలచిత్రానికి పూలు పళ్లు అర్పించి హారతి ఇచ్చాడు. ఆయన నవ్వుతూ" బాబూ! నేనింకా బతికే ఉన్నాను. ఆకలితో ఉన్న నాకు తింటానికి ఏమీ పెట్టకుండా నాచిత్రానికి ఎంచక్కా నైవేద్యం హారతి సమర్పించావు" అని హాస్యంగా అనేప్పటికి అంతా ఫక్కున నవ్వారు.ఇవీ మానాన్న చెప్పిన విషయాలు టీచర్!" "శభాష్! దీనివల్ల మీకు ఏంతెల్సింది?"
శివా అన్నాడు "మానవసేవే మాధవసేవ.ప్రతివారిలో భగవంతుని చూడాలి!"
టీచర్ అంది"ఇలా రోజూ ఒకరు ఒకజీవిత చరిత్ర చదివి మాఅందరికీ చెప్పాలి." సరే అంటూ తలూపారు అంతా🌷
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి