*చెప్పుకుంటుందేమో..ఏమో!; - కోరాడ నరసింహా రావు !

  చెట్టుకు  తన లేలేత పచ్చద నపు బిడ్డలపై,ఎంత మమకార మో.....!
    తన మట్టిచేతులతో... 
   అనురాగాన్ని  కురిపిస్తోంది !
   శాఖోప శాఖలుగావిస్తరించిన  కొమ్మబిడ్డలను చూసిమురిసిపో తుందేమో... !!
   తమజాతిని నిలువునా నరికి
కూల్చేస్తున్న నర రాక్షసులను చూసి, భయంతో కళ్లుమూసు కున్న తనసుకుమార సంతును 
ఎంత ఆప్యాయతతో బుజ్జగిస్తోందో... !
     ఈ మనుషులనిర్దాక్షిణ్యానికి 
మనవాంశాలెన్నో అంతరించి పోతున్నాయిటల్లీ,  మనం వాళ్ళ మేలుకై బ్రతుకుతుంటే వాళ్ళు మనబతుకులతో ఆడుకుంటూ... వాడుకుంటు న్నారు బిడ్డా.... !
   ఈ పాపం వాళ్ళ బిడ్డలకు తగులుతుందని పాపం...తెలు సుకో లేక పోతున్నారు !సంపాదించిన ఆస్తులతో పాటు 
ఈపాపాన్నీ కట్టబెడుతున్నారు 
 పాపం... ఆబిడ్డ లెలాబతుకు తారో... అంటూ తనబిడ్డతో ఆమాతృహృదయం  ఆక్రోశాన్ని 
చెప్పుకుంటుందేమో...ఏమో !!
       *****
కామెంట్‌లు