శబ్ద సంస్కృతి! అచ్యుతుని రాజ్యశ్రీ
 సింహావలోకనం అంటే సింహం వెనక్కు తిరిగి  తిరిగి చూసుకుంటూ ముందుకు సాగుతుంది. వేటకి బైలుదేరుతూ అది ఒక్కొక్క సారి మెడ వెనక్కి తిప్పి చూస్తుంది.తనకు పోటీగా వేరే జంతువు తను వేటాడే జంతువుని కబళిస్తుందేమో అని దాని అనుమానం! మనం గడిపిన గడిచిన  అనుభవాలు గుర్తు చేసుకుంటూ ఉంటాం.అదే సింహావలోకనం అంటే!
సంస్కారం అంటే మంచి మార్గం. మంచి నేర్పే విధానం! ఉపదేశం  మన భావాలు వ్యవహారం  నడవడి  మానవీయగుణాలు అన్నీ వస్తాయి. 
వికాస్ అంటేవృద్ధి విస్తరించు.మస్తిష్క వికాసం అని హిందీ లో అర్ధం. కానీ సంస్కృతంలో  పూలు వికసించడం అని ఉంది. వికసతి హి పతంగస్యోదయే పుండరీకం  అంటే సూర్యోదయం లో కమలాలు కనులు విప్పు
విటప్ అంటేశాఖలు కొమ్ములు ఉన్న వృక్షం. కాలాంతరంలో చెట్టునే  విటపంగా పిల్వసాగారు🌹

కామెంట్‌లు