ఇనుకుల వంశమును జన్మించినాడు
దశరథ పుత్రుడు శ్రీరామ చంద్రుడు
యుగయుగాలకి జగాన యుగపురుషుడు
అందరి వాడు ఆత్మీయుడు
పలికెడు వాడు దరహాసముల ఱేడు!!!
ధరణీ పుత్రిక జానకి కరమును
పట్టిన వాడు
ధర్మానికి ప్రతిరూపం
ఆదరణకు ఆత్మీయుడు
బ్రతుక్కి భరోసా, పాప పంకిలం
నామస్మరణచే శుద్ధి పొందు
అందాల రాముడు ఆజానుబాహుడు
అరవింద దళాయతాక్షుడు
జగతికి ఒక్కడే శ్రీరామచంద్రుడు
జనులందరి హృదయాలలో
నిలచిన వాడు శ్రీ సీతారాముడు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి