రుచి! అచ్యుతుని రాజ్యశ్రీ

 ఆరోజు టీచర్ పాఠం చెప్తూ "పిల్లలూ! భిన్నత్వంలో ఏకత్వం అంటే ఏంటి?" అని అడిగితే అంతా తెల్లమొహాలేశారు. "మన దేశం గూర్చి మీకేం తెలుసు?" శివా అన్నాడు " మన దేశం లో ఎన్నో భాషలు కులాలు మతాలు ఉన్నాయి.కానీ అంతా భారతీయులే!" "హైదరాబాద్ లో  ఎన్నో బడులున్నాయి.కానీ నర్సరీ నుంచి టెన్త్ దాకా వారి వారి సిలబస్ ఉంటుంది. కానీ అంతా పిల్లలే! ఉప్పు చక్కెర నీటిలో వేస్తే కరిగి నీరు ఉప్పగా తీయగా మారవచ్చు.కానీ నీరు ఒకటే! అలాగే మన దేశంలో వేర్వేరు భాషలు సాంప్రదాయాలు ఉన్నా ఐకమత్యంగా ఉండాలి  అని చెప్పిన మహామనీషి గురూజీ!"
"టీచర్!ఆయన హిమాలయాల్లో ఉండే సన్యాసి సాధువా?"పిల్లల ప్రశ్నకు టీచర్ చెప్పసాగింది."ఆయన జన్మత: మరాఠీ! ఆయన పేరు మాధవరావు గోళ్వల్కర్! దృఢమైన శరీరం కాదు కానీ మహాచురుకు. విన్నది విన్నట్లుగా తు.చ.తప్పకుండా అప్పచెప్పేవాడు.యోగాసనాలు ఫ్లూట్ సితార్ వాయించడంలో దిట్ట.ఒకసారి  చదువు తుండగా తేలు కుట్టింది.కుయ్ కయ్ అనలేదు."తేలు నాకాలుని కుట్టింది.నాతలను కాదుగా?" అనేప్పటికి చుట్టూ ఉన్నవారంతా దిమ్మెరపోయారు.తెగ పుస్తకాలు చదివి ఇతరులకు చెప్పేవాడు. నిజాం నవాబు మద్రాసు లో నీటిలో ఉండే ప్రాణులను చూడటానికి వస్తే టికెట్ కొన్నతర్వాతే లోపలకి పోనిచ్చాడు పి.హెచ్. డి.చేస్తున్న మాధవరావు.డాక్టర్ హెడ్గేవార్ తర్వాత ఆర్.ఎస్.ఎస్.గురూజీగా మారాడు.ఎంత దూరమైన కాలినడకతో వెళ్లే ఆయన  ఒకసారి  ప్రార్ధన సమయం లో కుంభవృష్టి కురుస్తుంటే గొడుగు తీసుకోవటానికి నిరాకరించారు. దేశప్రజలంతా నోటి దంతాలు నాలుకలాగా ఉండాలి. దంతాలు నాలుకను కొరికితే రాయితో దంతాలు విరగకొట్టం .అలాగే ప్రజలంతా ఐకమత్యంగా ఉండాలి. "అలాంటి మహానుభావుడు 
గురూజీ కి స్వామి వివేకానంద ఆదర్శం.మీరు సెలవుల్లో ఆయన జీవితచరిత్ర చదవండి ".అలాగే  అంటూ పిల్లలు తలూపారు🌷
కామెంట్‌లు