ఆరోజు టీచర్ పిల్లలకి చిన్న పోటీ పెట్టింది. "మీకు నచ్చిన విషయం రాయండి. బాగా రాసిన వారికి ఓబహుమతి ఉంటుంది. " ఏంరాయాలి ఎలా రాయాలి అని పిల్లలు అంతా మల్లగుల్లాలు పడసాగారు."ఇంగ్లీషులో రాస్తా టీచర్!""హిందీ మే లిఖుంగా!"
"నేను తెలుగు టీచర్ ని. తెలుగు లోనే రాసితీరాలి.మీభాష ఎలాఉన్నా ఫర్వాలేదు. అక్షరాల తప్పులున్నా ఫర్వాలేదు కానీ తెలుగు లో భావాలు తెలిసేలా రాస్తేనే బహుమతి!" ఖచ్చితంగా అంది టీచర్. "ప్లీజ్ రేపు రాస్తాంటీచర్!" "ఇంగ్లీషు పదంలేకుండా రాయాలి. " సరే అని అంతా బుర్ర ఊపారు.
శివా ఇంటికి వెల్తూనే" అమ్మా! రేపు బడిలో ఏదో ఒక దాని పై తెలుగు లో రాస్తే ప్రైజ్ ఇస్తారు. దేనిమీద రాయమంటావు?" అడిగాడు. "శివా!రోజూ ఎన్నో సమస్యలు!నేను నాలుగిళ్లలో పాచిపని చేస్తున్నా. మీనాన్న తోపుడు బండీపై కూరలు అమ్ముతాడు.మాబాధలు రాయి". ఆమర్నాడు శివా వ్రాశాడు " మాఅమ్మ నాన్న పడే కష్టాలు చూశాక నేను కూడా ఏదోపని చేయాలి అని నిర్ణయించుకున్నాను.రేపటి నుంచి పాలపాకెట్స్ పేపర్లు ఇంటి ఇంటికి వేసి డబ్బు సంపాదిస్తాను.నాఖర్చు నేనే భరిస్తాను." అదిచదివిన టీచర్ శివా కి బహుమతి ఇచ్చిందని వేరే చెప్పాలా?🌷

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి