సత్యవీణకు సాహితీ పురస్కారం

 నవభారత నిర్మాణ సంఘం వారు  అంతర్జాతీయ మహిళా దినోత్సవం,
అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం రోజున రవీంద్ర భారతి నందు సాహితీ కవి సమ్మేళనం లో  హైదరాబాద్ నగరానికి చెందిన కవయిత్రి  మొండ్రెటి సత్య వీణ  తన కవితాగానం చేయగా  సంఘ అధ్యక్షులు సూరేపల్లి రవికుమార్  పురస్కారాలు అందించారు. ఇట్టి కార్యక్రమానికి అథితులుగా ప్రముఖ
సాహితీవేత్త, ఎడిటోరియల్ కాలమిస్ట్, ఇంటర్నేషనల్ బెనెవోలెంట్ రీసెర్చ్ ఫౌండేషన్ సభ్యుడు  డాక్టర్ చిటికెన కిరణ్ కుమార్, సంఘ సేవకులు అమృత్ కుమార్ జైన్, విద్యాసంస్థల అధ్యక్షురాలు భారతి పలువురు ప్రముఖులతో పాటు  కవి సమ్మేళనం అధ్యక్షురాలు రాధా కుసుమ  మరియు వివిధ ప్రాంతాల నుండి కవులు,రచయితలు హాజరై నారు. ఈ సందర్భంగా సత్యవీణకు పలువురు కవులు రచయితలు అభినందనలు తెలియజేశారు.
కామెంట్‌లు