శబ్ద సంస్కృతి! అచ్యుతుని రాజ్యశ్రీ
 కొఠారి అనే పదం కోష్ఠాగారిక్ కోఠాగార్ కోఠార్ కాఠారి నుంచి వచ్చింది.రాజమహల్ అధ్యక్షుడు కోశాధికారి అని అర్థం.ఆలయ భవంతి బాగోగులు చూసే అధికారిని కొఠారి అంటారు.హిందీ లో కేవట్ అంటే చేపలుపట్టేవాడు నావనడిపే
వాడు అని అర్థం.కానీ సంస్కృతం లో గొయ్యి అని అర్థం.ఋగ్వేదంలో ఈపదంఉంది.కైవర్త నుంచి వచ్చింది అని కొందరి అభిప్రాయం.సంస్కృతం లో చేపలు పట్టే బెస్త వాడు.
కైకేయి పంజాబ్ కిచెందినది అని కొందరు ఆఫ్ఘనిస్తాన్ కి చెందినది అని ఇంకొందరి అభిప్రాయం.భరతుని తల్లి దశరధుని ముద్దుల రాణి.యుద్ధంలో నేర్పరి.
సంస్కృత కోటపాల్ నించి కొత్వాల్ వచ్చింది.దుర్గరక్షణ గావించే సైనికాధికారిని కోటపాల్ అనేవారు.కిలేదార్ అంటారు.ముస్లింలకాలంలో కొత్వాల్ గా మారింది.పోలీస్ ప్రధాన అధికారి.ఖలీఫా అరబ్బీ పదానికి అర్థం ఉత్తరాధికారి అని.ప్రతినిధి అని కూడా అర్ధం.తమ రాజకీయ నేతని మతపెద్దగా భావిస్తారు.సున్నీ సంప్రదాయం ప్రకారం సజ్జనుడు మంచి బుద్ధి కాలం విద్వాంసుడు ధార్మిక యోగ్యుడైన పాలకుని ఖలీఫా అంటారు.కురేశ్ వంశంలో పుట్టిన కురాన్ ధర్మాన్ని ఆచరించే వాడిని అర్థం.అలా కురేషీ అనే పదం వచ్చింది.షియామతానుసారం మహ్మద్ వంశీయులనే ఖలీఫా అని పిలవాలి.

కామెంట్‌లు
Popular posts
చిత్రాలు ; ..జ్యోతి టీచర్ వివేకానంద కాన్వెంట్ హైస్కూల్ భారత్ నగర్ (మూసాపేట)- హైదరాబాద్
చిత్రం
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
దగ్గు , ఆయాసం,పిల్లి కూతలు - నివారణ ------------------------------------------------------- పిల్లల్లో జలుబు, దగ్గు, ఎక్కువైనప్పుడు ఊపిరి తిత్తుల్లోని శ్వాస మార్గాలు ముడుచుకు పోయినప్పుడు శ్వాస వదులుతున్నప్పుడు శబ్దం వస్తే దాన్ని పిల్లి కూతలు అంటారు. దీనికి ఉబ్బసం కూడా ఒక కారణం కావచ్చు. వైరస్ బాక్టీరియా , కారణంగా శ్లేష్మపు పొరలు వాచిపోతాయి. దాని వల్ల గురక వస్తుంది కఫం వాలా జ్వరం కూడా రావచ్చు. చిటికెడు పిప్పళ్ల చూర్ణంలో తేనే వెచ్చని నీటిలో కలిపి తాగిస్తే కఫ జ్వరం తగ్గిపోతుంది పిప్పళ్ల పొడిని పాలతో కలిపి తాగిస్తే ఉబ్బసం తగ్గి పోతుంది. పిప్పళ్ల పొడితో బెల్లం కలిపి తినిపిస్తే దగ్గు, ఉబ్బసం తో పాటు రక్తహీనత కూడా నివారించ వచ్చు. - పి . కమలాకర్ రావు
చిత్రం
చిత్రాలు ; జి.జీవనజ్యోతి టీచర్ వివేకానంద కాన్వెంట్ హైస్కూల్ భరత్ నగర్ హైదరాబాద్
చిత్రం
తెలివితేటలు!! ప్రతాప్ కౌటిళ్యా
చిత్రం