శబ్ద సంస్కృతి! అచ్యుతుని రాజ్యశ్రీ

 ఉపాధ్యాయుడంటే ఒకప్పుడు  పూజారి పురోహితుడు అన్నారు.ప్రాచీన గురుకులాల్లో వ్యాకరణం మొదలైన వాటిని చెప్పి చదివించే వారిని ఉపాధ్యాయుడన్నారు. దుష్యంతుని పురోహితుడు ఉపాధ్యాయ సోమరాత్!
మహారాష్ట్ర లో రాజోపాధ్యే రాజపురోహిత్ గ్రామోపాధ్యే అనే పదాలున్నాయి.తామ్రపత్రాల్లో ఉపజా ఉపాధ్యా అనే పదాలున్నాయి. 
హిందీ లో ఓఝా  పాళీ భాషలో అజ్జాయకో ప్రాకృతం లోఉపజ్జాయ మరాఠీ లో ఉపాధ్యే  పంజాబీ లోపాందా  కన్నడంలో  ఆర్య ఉపాధ్యాయ గా వికాసం చెందాయి.ఓఝా అంటే మంత్రతంత్రగాడు  తాంత్రికుడు అని అర్ధం. శకునాలు చెప్తాడు. బెంగాలీ లో బంద్యోపాధ్యాయ ముఖోపాధ్యాయ చటోపాధ్యాయ అన్నవి ఆంగ్లంలో బెనర్జీ  ముఖర్జీ  చటర్జీ గా  మారి వాడుకలోకి వచ్చాయి 🌷
కామెంట్‌లు