అందాన్ని పెంచి... ఆకర్షణ ను
కలిగించేట్టు బట్టలుకుట్టేటైలర్ కూడా ఓ గొప్ప కళాకారుడే.... !
ఆవిశిష్ట కళకు ఆదరణ
.... ఎప్పుడూవుంది !!
రెడీమేడ్ దుస్తులు
కుట్టేదీ టైలరేగా.. !
ప్రతిభవుంటే....
జీవిక కు లోటేముంటుంది
టైలర్ గా బతకలేని మా...
తమ్ముడి లాంటివారూ...
లేకపోరు.... గానీ...,
మంచి పేరు, సంపాదనలతో...
దర్జాగా బ్రతికే....
దర్జీ లెందరులేరు !!
శ్రద్ద, నిజాయతీ ఉంటే....
టాలెంట్ ఎందుకురాదు ?
టాలెంట్ ఉండీ...ఆత్మవిశ్వాసం
లేని వాళ్ళే... మా సోదరునిలా
పాతబట్టలకు రిపేర్లు చేసుకు
బ్రతికే దుస్థితి... !!
యే చేతివృత్తికైనా,ప్రతిభయే సత్తాని... చాటుతుంది !
" శ్రద్దావాన్ లభతే జ్ఞానం....
... జ్ఞానేన ప్రాప్తి మోక్షం "
వృత్తిని గౌరవించి, అభిమానిం చి.... ప్రేమించే వారిని...
ఆ వృత్తే... పోషించి, పెంచి
సంపదను - ఖ్యాతిని...
.. ఆర్జించి పెడుతుంది.... !
ఆర్ట్ ఉన్నా.... ఆత్మ న్యూనత
మనిషిని ఎదగనీయదు... !
ముందు...నీమీద నీకు నమ్మ కాన్ని, పెంచుకోసోదరా... !
నీలోని విద్యను నీవెప్పుడూ చిన్నచూపు చూడకు... !!
నీ టాలెంట్ తో పాప్యులారిటీని పెంచుకో...
దాన్ని నిలబెట్టు కుం టూ....
గుర్తింపు...,గౌరవంతో పాటు సంపదను సౌఖ్యాన్నీ
పొందగలుగుతావ్.... !!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి