"నాటు" కున్న పాట;-డా.రామక కృష్ణమూర్తి
 తెలుగునాడు నుంచి వెళ్ళిన పాట
విశ్వరంగస్థలంపై "నాటు"కుంది.
"నాటు నాటు" యంటూ,
"చంద్ర" బౌన్సర్ వేయగా,
"కీ" సవరించిన "వాణి"
విశ్వవ్యాప్తం చేసాడు.
"ప్రేమ"తో "రక్షితం"గా స్టెప్పులందించి,
*తారక" మంత్రమై,"తేజ"మై
కాంతులు వెదజల్లింది.
"రాహుల్" రాగమై,"కాలభైరవ"
అనురాగమై పాడగా,
"ఆర్ ఆర్ ఆర్" అంటూ,
అనౌన్స్ మెంట్ రాగానే,
"ఆస్కార్" వరించింది.
తెలుగు పాటకు ఉత్తమ
కిరీటమే "ఆస్కార" మైంది.
"రాజమౌళి" గా వినుతికెక్కింది.
యెద యెదలో నాటుకున్న పాట
అదేపనిగా మార్మోగింది.
హద్దులు చెరిపేసి,
సరిహద్దులు దాటేసి,
"చరణ" విన్యాసాలు చేసేసింది.
"పాట"కే "తారక" మంత్రమై నడయాడింది.
వాటేసుకొని,నాటేసుకొని,
మాటు వేసుకొని,సూటేసుకొని,
కాసుకొని,
ఆఖరుకు...............
"ఒరిజినలై" ఎగరేసుకొని వచ్చింది.

కామెంట్‌లు