పరీక్షలు!అచ్యుతుని రాజ్యశ్రీ

మార్చి వచ్చింది. ఎండలు మిటమిట!నీటి కటకట!పిల్లలు పెద్దల్లో పరీక్షల ఆందోళన! అమ్మ  రోజూ  ఒక టైంటేబుల్ లాగా పొద్దుటే కాఫీ టిఫిన్  వంట పూర్తి చేస్తుంది. పనామె ఇల్లు బట్టలు బాసాన్ల పని ముగించి పోతుంది. నాన్న  టైంకి ఆఫీసు కి ఠంచన్ గా వెళ్తాడు. అలాగే జూన్ నించి రోజూ బడి లో చెప్పిన పాఠాలు  ఎప్పటికప్పుడు  చదువుకుంటే పెద్ద పరీక్షలకి ఖంగారు పడనవసరంలేదు.రాని సబ్జెక్టులు కష్టంగా  ఉండేవి ముందు తెల్లారుఝామున చదవాలి. పుస్తకం పేజీలు తిరగేస్తూ"బాబోయ్!ఇన్ని పేజీలున్నాయి.ఎలా చదవాలి?" అని ఆలోచన చేయడం సమయం వృధా చేయడమే!మనం కూడా ఈసబ్జెక్ట్ ఇన్ని పాఠాలు చదవాలి  అని లక్ష్యం గా పెట్టుకోవాలి. "టీచర్ చెప్పింది  శ్రద్ధగా విన్నారు పిల్లలు. "మరి టీచర్లు అమ్మా నాన్నలు చదువు చదువు అని సతాయిస్తుంటే టెన్షన్ పెరుగుతుంది కదామాకు?" శివా గట్టిగా అడిగాడు "అవును. టెన్షన్ పెట్టరాదు పిల్లలు పెద్దలు కూడా. మానసికంగా  నీవు చదవలేవు.పరీక్షలో మార్కులు తక్కువ వస్తే ఊర్కోము.మాకు పరువు పోతుంది " అనరాదు. హనుమ కి వానరులంతా ఎలా ధైర్యం చెప్పారో మీకు తెలుసుగా? అందుకే  నీవే సీతజాడను కనుక్కోగలవు అని నీవు బలంశక్తి గలవాడివని ఉత్సాహపరిచారు.దీన్ని కౌన్సిలింగ్ అని ఇప్పుడు అంటున్నారు. మన పనిని చిన్న చిన్న ముక్కలుగా విభజించి బడిలో పీరియడ్స్ లాగా ఆగని గడియారం లాగా చేస్తూ పోవాలి." పిల్లలు 
కామెంట్‌లు