* జయహో....... !; - కోరాడ నరసింహా రావు.

 దీక్షా, పట్టుదలలతో... ఏ పని 
 చెయ్యాలన్న... మగవారికంటే ఓపికతో, శ్రద్దగా ఆపనిని ఆడ వారే చెయ్యగలరు !
        కేవలం ఇంటిపనులే కాదు
 ఆ పనులతోపాటు  ఉద్యోగబా ధ్యతలు.. అటు - ఇటు కూడా సమర్ధవంతంగా నిర్వహించిన 
నిర్వర్తిస్తున్న మహిళా మణులెందరో.... !
ఈ మధ్యనే నాకు పరిచయ మైన మహిళామణి, గూడూరు సీతామహాలక్ష్మీ గారు... !
  చాలాఘనకార్యాలు,ఉపాధ్యా
 యులే సాధించారు...... ఈమె కూడా  ఉపాధ్యాయురాలే.. !
.... ఈమె విశాఖపట్నం నివాసే 
 ఉపాద్యాయురాలుగా బాధ్యత లు తీసుకున్నది మొదలు... 
అవిరళ సేవా కార్యక్రమాలతో 
జన్మను సార్ధక్యం చేసుకున్నారు
సావిత్రీ బాయ్ పూలేని ఆదర్శం 
గా తీసుకుని, సేవా సంస్థలు, విద్యాలయాలతో పాటు... 
 మరణానంతర జీవనం అనే నినాదంతో... అవయవదాన సంస్థను స్థాపించారు !
     ఆమె అవిరళ  కృషినిస్ఫూర్తి గాతీసుకుని ఎందరోకార్యకర్తలు
విశాఖపట్నం చుట్టూ వున్న ప్రాంప్రాంతాలకు  విస్త రించట మే కాకుండా చుట్టూ వున్న జి ల్లాలకార్యకర్తలు తయారవ్వ టం, చెప్పుకోదగ్గ గొప్పతనం ! 
    ఇందులో... గొప్ప - గొప్ప డాక్టర్ లు, ప్రోపేసర్ల తో పా టు 
సామాన్య బార్బర్ లాంటి వారు 
నడవలేక వీల్చైర్ లోనే బ్రతుకు తున్న వారు, ఉపాధ్యాయులు, 
విద్యార్థులు, వీళ్లంతా ఈ కార్యక్రమాలకు భాగ స్వాములే 
        నా చిరకాల వాంఛ, అవయవ దానంతో పాటు, నాశరీరాన్ని పూర్తి పరిశోధ నలకు అప్పగించేయటం !
      ఈమెను నాకు పరిచయం చేసిన మిత్రులు లైబ్రేరియన్ నరసింహంగారికి కృతఙ్ఞతలు తెలుపుతూ నేను నాశరీరాన్ని వైద్య విజ్ఞాన పరిషత్ కు అప్పగించటానికి అంగీకరిస్తూ కాగితాలమీద సంతకాలతో పాటు, నాభార్యనూ అవయవదానానికి అంగీకరింపజేసి ఆమె చేత కూడా సంతకాలు చేయించాను 
 అలాంటి మహిళలు అరుదు !
ఆమె కుమార్తెను డాక్టర్ ను చెయ్యటమే కాకుండా భర్తను కూడా ఈ సేవా కార్యక్రమాలకు భాగస్వామిని చేయగలిగారు !
  ఇలాంటివారు... ఎంత ఎక్కువమంది తయారైతే అంత చక్కగా... సేవాసమాజాలు తయారై... ఆదర్శ సమాజాలు తయారౌతాయి.... 
  జయహో...., గూడూరు సీతా 
మహాలక్ష్మి గారు జయహో 
      *******

కామెంట్‌లు