శబ్ద సంస్కృతి! అచ్యుతుని రాజ్యశ్రీ
ఋషి అంటే అర్థం మంత్రద్రష్ట అని.వీరిద్వారా వేదాలు వినటం సంభవించింది కాబట్టి వాటిని శృతి అన్నారు.యాస్కుని మాటల్లో "యస్వం వాక్యం స ఋషి.ఎవరివాక్యాలైతే సిద్దాంతాన్ని ప్రతిపాదిస్తాయో వారిని ఋషులు అన్నారు.ఋగ్వేదం మొదలైన వాటిని కంఠస్థం చేసినవారు మంత్ర ఋషులు.దేవ బ్రాహ్మణ రాజులను దేవర్షి బ్రహ్మర్షి రాజర్షి అంటారు.ఋషుల్లోకూడా ఏడు భేదాలు ఉన్నాయి.మహర్షి పరమర్షి దేవర్షి బ్రహ్మర్షి ఋతర్షి రాజర్షి కాండర్షి.ఋగ్వేదంలో ఆరు మండలాల ఋషులు గృత్సమద విశ్వామిత్రవృమదేవ అత్రి భారద్వాజ వశిష్ఠ కశ్యప భగవద్గీత లో కూడ వీరే! తైత్తిరీయ సంహితలో కాండర్షిని పేర్కొన్నారు.ఋష్ అనే ధాతువు నుంచి ఋషి వచ్చింది.వేగంగా దైవం వైపు వెళ్లే మాంత్రికుడు అని కొన్ని గ్రంథాలలో ఉంది.ఋషి దూరదృష్టి గలవాడు.ఎక్కడికైనావెళ్ళే సత్తా ఉన్నవాడు.దేవరాక్షస మనిషికన్నా భిన్నులు.మహాభారతంలోగౌతమ భరద్వాజ విశ్వామిత్ర జమదగ్ని వశిష్ఠ కశ్యప అత్రి సప్తర్షులు.కానీ శాంతి పర్వం లో మారీచి అంగీర పులస్త్య పులహ ఋత వశిష్ఠ పేర్లున్నాయి.అధర్వవేదంలో దాదాపు 18ఋషుల పేర్లు న్నాయి.ఋగ్వేద సప్తర్షులు ఆకాశంలో తారలకి సూచన.సప్త ఋక్ష అనే పదం క్రమంగా సప్తర్షి గా మారింది.ఈశ్వరస్తోత్రాలు చేశారు.ఋషి కల్పనాశీలి. కొందరు రాజపురోహితులుగా ఉన్నారు.గృహస్థ జీవితం గడిపారు.సర్వకాలాల్లో రాజు ప్రజలకు మార్గదర్శి
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి