కోపం కొంప ముంచుతుంది; - :సి.హెచ్.ప్రతాప్
 తన కోపమే తన శత్రువు అని చెబుతుంటారు. అంటే కోపం వల్ల మనిషికి తీరని నష్టం జరుగుతుందని అర్థం. అలాగే ఎప్పుడూ ఏడుస్తూ ఉండడం మంచిది కాదని, విచారంగా ఉండడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తాయని చెబుతున్నారు. మనిషికి భావోద్వేగాలు ఉండాలి కానీ, అవసరానికి మించి ఉంటే అనర్థానికి దారితీస్తుందని మానసిక నిపుణులు చెబుతున్నారు.
పిల్లల్ని నియంత్రించలేక తల్లిదండ్రులు తలలు పట్టుకుంటుంటారు. దీంతో కోపంతో పిల్లలపై అరవటం, దండించడం వంటివి చేస్తుంటారు. అయితే పిల్లల్ని దారిలో పెట్టేందుకు ఇది సరియైన పద్ధతి కాదని చెబుతున్నారు మానసిక నిపుణులు.
 న్యూక్లియర్‌ ఫ్యామిలీల కారణంగా ఒక్కరు తప్పితే ఇద్దరు పిల్లలే ఉంటున్నారు. వాళ్లకు ఆటా పాట అన్నీ తల్లిదండ్రులతోనే అవుతోంది. దీంతో గారాబం ఎక్కువ అవుతోంది. ఫలితంగా పిల్లల్లో మొండిపట్టు, మంకుపట్టు ఎక్కువవుతోంది. ఇటువంటి పిల్లలతో వ్యవహరించటం తలకు మించిన పని అవుతుంది. అందుకే వీరితో పట్టువిడుపుతో మెలుగుతుండాలి.
ఇంట్లోని పెద్ద వారిని గౌరవించటం, తోటి వారిని అభిమానంగా పలకరించటం, ప్రశాంతంగా జవాబులు ఇవ్వటం వంటివి ఇంట్లోనే అలవాటు చేయాల్సి ఉంటుంది. ఇవి పెద్దవారిని చూసి పిల్లలు బాగా నేర్చుకొంటారు. అందుచేత పిల్లలకు ఈ విషయాల్ని విడమరిచి చెప్పాలి. కేకలు పెట్టడం, ఒక్కసారిగా విరుచుకు పడటం మంచిది కాదు.
పిల్లలు ఎప్పుడూ పిల్లలతోనే ఆడుకోవాలని కోరుకుంటారు. తోటి పిల్లలతో అనుకరించటం లేదా తోటి పిల్లలకు నేర్పించటం అంటే బాగా ఇష్టపడతారు. సరిగ్గా ఈ టెక్నిక్‌ నే పెద్దలు కూడా అనుసరించాలని నిపుణులు సూచిస్తున్నారు.
పిల్లలతో ప్రశాంతంగా, నిదానంగా ఉండటం మంచిదే కానీ, అవసరమైనప్పుడు కఠిన వైఖరి అవలంబించాలి. వద్దన్న పని చేస్తామని పదే పదే మొండికేస్తుంటారు. కొన్ని సార్లు చెప్పిన మాట వినకుండా పెంకిగాఉంటారు. అటువంటప్పుడు సంయమనంతో చెబుతూనే ఉండాలి. అదే సమయంలో పిల్లల మనస్సు మరలించి రాంగ్‌ స్టెప్‌ పడకుండా చూడాలి.అవసరమైతే ఇటువంటి సమయంలో కఠినంగా కూడా వ్యవహరించా

కామెంట్‌లు