కృషి ఉంటే!అచ్యుతుని రాజ్యశ్రీ

 ఆరోజు శనివారం ఆఖరి పీరియడ్!పిల్లలంతా పాటలు పాడుతూ సరదాగా ఉన్నారు. శివా పాడుతున్నాడు"కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు మహాపురుషులవుతారు" .చప్పట్లతో క్లాస్ మార్మోగింది. "శభాష్ శివా!చక్కని పాట పాడావు.దీనికి సంబంధించిన ఓవ్యక్తి కథ చెప్తాను.కథకాదు.నిజగాథ!మనం బట్టలు ఎలాఉతుకుతాం?""ఏముంది!వాషింగ్మిషన్లో వేసి "."కరెక్ట్!రకరకాల బట్టలుతికే సబ్బులు పౌడర్ లున్నాయి.కొన్ని పేర్లు చెప్పండి.""సర్ఫ్ వాషింగ్ పౌడర్ నిర్మా..""గుడ్! నిర్మా వాషింగ్ పౌడర్ యజమాని కర్సన్ భాయ్! అహ్మదాబాద్ గల్లీలో తనసైకిల్ పై డిటర్జెంట్ పౌడర్ అమ్మేవాడు.కేవలం 3రూపాయలకు కిలోనిర్మా వాషింగ్ పౌడర్ అమ్మిన ఆయన నిర్మా యూనివర్సిటీ నెలకొల్పారు. గుజరాత్ లోని  రూప్ పుర్ లో రైతుకుటుంబంలో పుట్టి 21ఏళ్ళకే కెమిస్ట్రీ లో  డిగ్రీ పొందాడు. కాటన్ మిల్లులో లాబ్ టెక్నీషియన్ గా పనిచేసి ప్రభుత్వ ఉద్యోగం పొందాడు. ఎన్నో ప్రయోగాలు చేసినిర్మా డిటర్జెంట్ యజమాని అయి కోట్లకి పడగలెత్తారు.నిరుపమ అనే ఆయన కూతురు కారు ప్రమాదం లో చనిపోతే ఆపాపపేరుమీదుగా నిర్మా పౌడర్ ని తయారు చేశారు. ఆపాకెట్ పై ఉండే ఆబొమ్మ ఆపాపయే! నిర్మా ఫౌండేషన్  నిర్మా మెమోరియల్ ట్రస్ట్  చనస్మా రూపపుర్ గ్రామ వికాస్ ట్రస్ట్ ద్వారా సమాజసేవ చేస్తున్నారు ఆయన!".పిల్లలు ఆయనని గూర్చి విని సంబరపడ్డారు. ఇంతలో ఇంటిబెల్ మోగింది🌹
కామెంట్‌లు