కరోనా కాలనాగు కాటేసిన
కుటుంబాలు
ఒక వైపు
కంటతడి ఆరని పసి హృదయాలు
మరోవైపు
చెట్టుకొకరు పుట్టకొకరు
గల్లంతై
గంపెడు శోకంతో
ఎదబాదుకుని బావురుమనే
విషాదఛాయ వదనాలు
ఇంకా కళ్లెదుటే కన్పిస్తూనే ఉన్నాయి
పెట్టుబడులే గానీ గిట్టుబాటు
ధరలు లేని అన్నదాతల
ఆక్రందనలు ఆకాశాన్నంటే చూడు!
అప్పుల ఊబిలో చిక్కుకొని
ఉరికొయ్యకు వేలాడే
'జై కిషన్' గోడు చూడు
కాగితాలకే కానీ జీవితాలకు
విలువివ్వని మానవత్వం మరచిన దానవులను చూడు
కన్నవారే బరువై
అనాథాశ్రమాలకు చేరువై
ఆదరణకు కరువై
అల్లాడి పోతున్న
పండుటాకుల అరణ్య రోదన చూడు
దౌర్భాగ్యమైన ఈ దుస్థితిలో
'శ్రీ శోభ కృత్' వత్సరమా!
నీకెలా స్వాగతం పలికేది?
శబ్దాలంకారాలతో ,అర్ధాలంకారాలతో,
శ్లేషార్ధాలతో
నిన్నేలా వట్టి పెదాలతో శ్లాఘించేది!!
ఎన్ని వత్సరాలు వచ్చినా ఇంతేనా?
'ఎక్కడ వేసిన గొంగళి అక్కడేనా?'
'ఓ శ్రీ శోభ కృత్' తెలుగు సంవత్సరమా!!
నీ అగమనంతోనైనా! ఇక
రైతన్నల తలరాతలు మారేనా?
నీ పేరులోని 'శోభ' వోలె
శోభాయమానంగా వెలిగేనా?
పండుగ పూటైనా పట్టెడన్నం
పేదోళ్ల కడుపులకు పుట్టేనా?
కుటుంబాలు
ఒక వైపు
కంటతడి ఆరని పసి హృదయాలు
మరోవైపు
చెట్టుకొకరు పుట్టకొకరు
గల్లంతై
గంపెడు శోకంతో
ఎదబాదుకుని బావురుమనే
విషాదఛాయ వదనాలు
ఇంకా కళ్లెదుటే కన్పిస్తూనే ఉన్నాయి
పెట్టుబడులే గానీ గిట్టుబాటు
ధరలు లేని అన్నదాతల
ఆక్రందనలు ఆకాశాన్నంటే చూడు!
అప్పుల ఊబిలో చిక్కుకొని
ఉరికొయ్యకు వేలాడే
'జై కిషన్' గోడు చూడు
కాగితాలకే కానీ జీవితాలకు
విలువివ్వని మానవత్వం మరచిన దానవులను చూడు
కన్నవారే బరువై
అనాథాశ్రమాలకు చేరువై
ఆదరణకు కరువై
అల్లాడి పోతున్న
పండుటాకుల అరణ్య రోదన చూడు
దౌర్భాగ్యమైన ఈ దుస్థితిలో
'శ్రీ శోభ కృత్' వత్సరమా!
నీకెలా స్వాగతం పలికేది?
శబ్దాలంకారాలతో ,అర్ధాలంకారాలతో,
శ్లేషార్ధాలతో
నిన్నేలా వట్టి పెదాలతో శ్లాఘించేది!!
ఎన్ని వత్సరాలు వచ్చినా ఇంతేనా?
'ఎక్కడ వేసిన గొంగళి అక్కడేనా?'
'ఓ శ్రీ శోభ కృత్' తెలుగు సంవత్సరమా!!
నీ అగమనంతోనైనా! ఇక
రైతన్నల తలరాతలు మారేనా?
నీ పేరులోని 'శోభ' వోలె
శోభాయమానంగా వెలిగేనా?
పండుగ పూటైనా పట్టెడన్నం
పేదోళ్ల కడుపులకు పుట్టేనా?

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి