సాయి భక్తి గేయం;- ఎడ్ల లక్ష్మి
శరణం శరణం సాయి దేవా
మాపై నీవు కరుణ చూపరావా
కళ్ళు మూసిన కళ్ళు తెరచినా
నా మది నిండా నీ రూపే సాయి దేవా !!

మానవ రూపంలో ఉన్న
మహాదేవుడవు నీవయ్యా
శాంతి స్వరూపుడవు నీవు
వింత లేన్నో చూపే సాయి దేవా !!

ప్రేమతో నిన్ను పిలిస్తే చాలు 
మా ముందు నీవు నిలుస్తావు
నీ చల్లని చూపుతో చూస్తావు
దయతో దీవిస్తావు సాయిదేవా !!

నీ అడుగులో అడుగు వేస్తూ
నన్ను నడవనీయు స్వామి
పట్టుకున్న నీ చేయిని సాయి
వదిలించబోకు సాయి దేవా !!

ఊగీసలాడే ఈ జీవితనావను
సుడిగుండాలలో చిక్కకుండా
నడి సముద్రములో మునగకుండా
గమ్యము చేర్చు సాయి దేవా !!


కామెంట్‌లు