రాజ్యాంగ పీఠిక సమన్యాయ హామీ ప్రకారం.. సంపద అందరికీ సమానంగా పంచాలి. అయితే, అవినీతి దీనికి ప్రధాన అవరోధంగా మారుతున్నది. దీంతో ప్రజలకు సామాజిక సమ న్యాయం తీరని కలగానే మిగిలిపోయింది.
అవినీతి అనారోగ్యంలాంటిది. కేవలం పాలనా రంగానికే ఇది పరిమితం కాలేదు. దురదృష్టవశాత్తూ.. ప్రతిఒక్కరి జీవితంలోనూ ఏదో రూపంలో భాగమైంది.
హిందూ పురాణాల ప్రకారం. దురాశ అనేది ఏడు పాపాల్లో ఒకటి. అయినా మన సమాజంలో ప్రజలకు పాపభీతి లేకుండా పోతుండదం దురదృష్టకరం.అయితే, సంపదపై దురాశ అనేది ‘అవినీతి’ అనే క్యాన్సర్‌గా వృద్ధి చెందేందుకు దోహదం చేస్తున్నది.అవినీతిపరులు కోర్టుల నుంచి కూడా తప్పించుకొంటే, ఇక తప్పు చేస్తున్నామన్న భయం కూడా వారికి ఉండదు.దానితో మరికొందరు ఈ అవినీతి మార్గం వైపు నిర్భయంగా మళ్ళుతారు.
ప్రజాసేవలో ఉన్నవారిలో కొంతమంది వ్యక్తిగత ప్రయోజనాల కోసం వెంపర్లాడటం ఆందోళన కలిగించే విషయంగా మన సర్వోన్నత న్యాయ స్థానం ఏనాడో పేర్కొంది.
కుంభకోణాల వెనకున్న నిజాలను బయటికి రాబట్టడంలో జరిగే దర్యాప్తు పారదర్శకంగా ఉండాలి. అదే జరుగని నాడు దర్యాప్తు విధానమే పెద్ద స్కామ్ అవుతుంది.
అవినీతిని అరికట్టడానికి పాలనలో పారదర్శకత పెంపొందించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటిదాకా చేసిన ప్రయత్నాలు కొంత సత్ఫలితాలను ఇచ్చాయి. ఆశించిన మార్పు పూర్తి స్థాయిలో రాలేదు. సర్కారు కొలువంటేనే చేతనైనంత దోచుకోవడానికి జీవితకాల లైసెన్స్ గా కొంత మంది ప్రభుత్వ ఉద్యోగులు భావిస్తున్నారు. ప్రకృతిలో ఎంత చెట్టుకు అంతగాలి అన్నట్లుగా ప్రభుత్వ కార్యాలయంలో ఎంత పదవికి అంత అవినీతి అన్నట్లుగా మారిన సందర్భాలు ఎన్నో ఉంటున్నాయి. మితిమీరిన రాజకీయ జోక్యం, న్యాయస్థానాల్లో ఎంతకీ తెగని కేసులు ఈ సమస్య కొనసాగడానికి కారణం అవుతున్నాయి. ట్రాన్స్ఫరెన్సీ ఇంటర్నేషనల్ సంస్థ ఇటీవల విడుదల చేసిన ప్రపంచ అవినీతి సూచీలో ప్రభుత్వ రంగ అవినీతిలో భారత్ 85వ స్థానంలో నిలిచింది. సులభతర వ్యాపార అనుకూల దేశాల చిట్టాలో 63 దేశాల జాబితాలో భారత్ 37వ ర్యాంకులో నిలిచింది. ఈ ర్యాంకుల ఫలితంగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు తగ్గిపోతున్నాయి
అవినీతి జాడ్యం;-: సి.హెచ్.ప్రతాప్
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి