ఉంటుందా?;- -గద్వాల సోమన్న
ఎండమావుల్లో 
నీరు ఉంటుందా?
నేతి బీరకాయలో
నెయ్యి ఉంటుందా?

గగన కుసుమంలో
పూవు ఉంటుందా?
లోభి హృదయంలో
దాతృత్వముంటుందా?

కోపిష్టి మనసులో
శాంతి ఉంటుందా!
వదరుబోతు నోటిలో
మాట నిలుస్తుందా?

పేరుకు తగ్గట్టు
బ్రతుకు లేకుంటే
సభ్య సమాజంలో
గౌరవముంటుందా?


కామెంట్‌లు