తెలుగు జాతీయం.;- తాటి కోల పద్మావతి గుంటూరు

 అడకత్తెరలో పోక.
కత్తెర లాంటి ఒక ఉపకరణం. పోకలను ఒక్కలుగా, ముక్కలుగా చేయడానికి ఉపయోగించే గృహోపకరణం. తాంబూలం లో వాడే వక్కలను సిద్ధం చేయుటకు ఈ అడకత్తెరను వాడుతారు. రోలు, రోకలి, పెరగాలి వాడుక నుండి దూరమైనట్లే ఈ అడకత్తెర సాధనము కూడా వాడుకకు దూరం అవుతున్నది. ఈసాధనమునకు కింద ఒక పైన ఒక కత్తి ఉంటుంది. ఈ రెండు కొనలు కలిసి ఉంటాయి. పైకి, క్రిందకు ఆడుటకు వీలుగా ఉంటాయి. క్రింది కత్తి పైన పోకను పెట్టి పైకట్టితో ఒత్తుతారు. అప్పుడా పోక రెండు కత్తెరల మధ్య తిరిగి పగిలి ఒక్కలైపోతుంది. ఈ విధంగా వక్కలను తయారుచేస్తారు. అయితే రెండు విధాల కష్టాలను అనుభవించేవారు"అడకత్తెరలో పోక చందమయ్య"అని అంటూ ఉంటారు. రకరకాల ఇబ్బందుల్లో ఉండి దిక్కు తోచని స్థితిలో ఉన్నప్పుడు అడ కత్తెరలో ఉన్నామని వాపోతుంటారు. ఇద్దరూ పెళ్ళాలు ఉన్నవారు, తల్లి గయ్యాళి దై భార్య గడుసుదైనప్పుడు బాధ అనుభవించువాడు అడకత్తెరలో పోకగానే భావించాలి. వాని బ్రతుకు దుర్భరము.

కామెంట్‌లు