పటాటోపం! అచ్యుతుని రాజ్యశ్రీ

 శివా పార్వతి చిన్న కర్రీ పాయింట్  చాయ్ దుకాణం నడుపుతున్నారు. ఇంట్లో రుచిగా శుచిగా ఎవరికి కావల్సినవి వారికి ముందే ఆర్డర్ తీసుకుని తయారు చేసి స్వయంగా వారికి  పట్టుకొని వెళ్లి ఇస్తారు. కస్టమర్లు స్వయంగా వచ్చి తీసుకుని వెళ్తారు. కావల్సిన వారికి  అప్పటికప్పుడు బజ్జీలు దోసెలు  ఇడ్లీ వేస్తుంది పార్వతి. కమ్మని చాయ్ చేసి శివా అందరికీ ఇస్తాడు. ఇద్దరూ కలిసి అంట్లగిన్నెలు తోమేస్తారు.
ఆపక్కనే ఓధనవంతుడు చాలా షోగ్గా పటాటోపాలతో అద్దాలు అమర్చిన  రకరకాల వంటకాలు పెట్టినా ఓనాల్గురోజులు వెళ్లి  జనం మానేశారు. దానికి కారణం ఏంటో తెలుసా?ఆషాపులో ఆప్యాయత ఆదరణ ప్రేమగా పలకరింపులు ఉండవు.పైగా ధర కూడా ఎక్కువే.అందుకే ఇప్పటికీ శివా పార్వతి దగ్గరకే అంతా వెళ్తున్నారు. బీదాబిక్కీకి  వారే అన్నపూర్ణ స్వరూపాలు. పటాటోపం తాత్కాలికం.మంచి తనం ఆదరణ శాశ్వతం 🌹
కామెంట్‌లు