తెలుగుజాతీయం.;- తాటి కోల పద్మావతి గుంటూరు

 అడుగులకు మడుగులోత్తుట:-అడుగులు అంటే పాదాలు. మడుగులు అంటే బట్టలు. పూర్వము మహారాజులు, మహారాణులు బయలుదేరేటప్పుడు వాళ్ల కొంగులు, వెనుక రేలారే వస్త్రాలను ఎత్తడానికి సేవకులు ఉండేవారు. కాళ్లకు అంటే పాదాలకు నేల తగిలి బాధపడకుండా ఉండే కొరకు రాజులు, రాణులు నడుస్తూ ఉంటే వాళ్ల ముందు తట్టులు మున్నగు మెత్తని తివాచీల లాంటివి పరిచేందుకు బటులు ఉండేవారు. అయితే వారు నడిచే కొద్దీ తివాచీని తీసి ముందు ముందు పరుస్తూ పోతుంటారు. దీనినే అడుగులకు మడుగులోత్తుట అంటారు.
అలాంటి సేవలు లేవు కానీ మంత్రులకు డబ్బు గలవారికి వంగి వంగి సలాములు చేయటం. వారికి అణిగిమణిగి ఉండటం అనేవి జరుగుతూ ఉంటుంది. అట్టి వారిని అడుగులకు మడుగులోత్తుతున్నారని అంటారు.
దేవస్థానాలలో ఈనాటి పూజార్లు రాజకీయ నాయకులు వచ్చినప్పుడు అడుగులకు మడుగులోతుతుంటారు. వినయ విధేయతలు ప్రకటిస్తూ ఉంటారు.

కామెంట్‌లు