నిన్నటి నిరాశ పోవాలంటే
రేపటిపై ఆశ పెంచుకోవాలి
ఏ క్షణం ఏమవుతుందో
ఏ కబురు చల్లగా వస్తుందో
ఏ మాట ఎదురెరుగని
బాట అవుతుందో!
ఏ బాట ఏ తెలియని
విజయాలకు చేరువ చేస్తుందో!
ఏ విజయం ఏ శిఖరానికి
తొలిమెట్టవుతుందో!
ఏ మెట్టు మరో మజిలీకి
దారి చూపుతుందో?
ఏ మజిలీ ఏ సుందర
స్వప్నం సాకారం చేస్తుందో!
ఏ స్వప్నం ఎదను నింపే
హాయిని ఇస్తుందో!
ఏ హాయి ఎంత మధుర
భావనలిస్తుందో!
ఏ మధుర భావన మదిలో
వీణలు మోగేలా చేస్తుందో!
ఏ వీణ ఏ మౌనాన్ని
రాగంగా పలుకుతుందో
ఏ రాగం హృదయాన్ని
మెత్తగా స్పృశిస్తుందో
ఏ హృదయం ఏ ఉదయం
కోసం ఎదురు చూస్తోందో
ఆ అపూర్వమైన ఉదయాన్ని
ఆనందంగా స్వాగతిస్తూ
🌸🌸 సుప్రభాతం 🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి