అంధ విశ్వాసాల ఆబోతులు
రంకెలేసి రాగబంధాలు తెంచేస్తున్నాయి
కుల జాడ్యపు కుక్కుటాలు
శిరములెత్తి తరుముకొస్తున్నాయి
మత మౌఢ్యపు మర్కటాలు
గంతులేసి గొంతు నులిమేస్తున్నాయి
అవినీతి గరళ పన్నగాలు
పడగవిప్పి బుసలు కొట్తున్నాయి
కుంభకోణాల పందికొక్కులు
గుంభనంగా దేశాన్నే దొలిచేస్తున్నాయి!
మత్తు పదార్థాల మత్కుణాలు
మనిషిని పీల్చి పిప్పి చేస్తున్నాయి
కాలుష్యపు కంటకావృతాలు
విచ్చు కత్తులై కుత్తుకలుత్తరిస్తున్నాయి
నగ్నదృశ్య దర్శక వాత్సాయనులు
కుర్రకారు బుర్రల్ని ఖరాబు చేస్తున్నారు
వెర్రి తలలేస్తున్నా ఈ వికృత రూపాలతో
భయ విహ్వలైన భరతదేశంలో
సగటు మనిషికి భద్రతెక్కడ?
ఉగాది పండుగ వేడుకెక్కడ?
అందుకే.......
మగువలంతా దుర్గమాతలై
మగవారంతా రుద్రమూర్తులై దుష్టశక్తులనెల్ల దునుమాడాలి
భరతమాతకు బాపటగ నిలవాలి.
అపుడే......ఆనందవుటుగాది జరుపుకోవాలి.
" రసస్రవంతి "
" సాహితీ విరాట్ "
'వాజ్ఞ్మయ రత్నాకర '
7075505464
" కావ్యసుధ "
'వాజ్ఞ్మయ భూషణ'
'ఆధ్యాత్మిక సాహిత్య సామ్రాట్'
9247313488 : హైదరాబాదు
రంకెలేసి రాగబంధాలు తెంచేస్తున్నాయి
కుల జాడ్యపు కుక్కుటాలు
శిరములెత్తి తరుముకొస్తున్నాయి
మత మౌఢ్యపు మర్కటాలు
గంతులేసి గొంతు నులిమేస్తున్నాయి
అవినీతి గరళ పన్నగాలు
పడగవిప్పి బుసలు కొట్తున్నాయి
కుంభకోణాల పందికొక్కులు
గుంభనంగా దేశాన్నే దొలిచేస్తున్నాయి!
మత్తు పదార్థాల మత్కుణాలు
మనిషిని పీల్చి పిప్పి చేస్తున్నాయి
కాలుష్యపు కంటకావృతాలు
విచ్చు కత్తులై కుత్తుకలుత్తరిస్తున్నాయి
నగ్నదృశ్య దర్శక వాత్సాయనులు
కుర్రకారు బుర్రల్ని ఖరాబు చేస్తున్నారు
వెర్రి తలలేస్తున్నా ఈ వికృత రూపాలతో
భయ విహ్వలైన భరతదేశంలో
సగటు మనిషికి భద్రతెక్కడ?
ఉగాది పండుగ వేడుకెక్కడ?
అందుకే.......
మగువలంతా దుర్గమాతలై
మగవారంతా రుద్రమూర్తులై దుష్టశక్తులనెల్ల దునుమాడాలి
భరతమాతకు బాపటగ నిలవాలి.
అపుడే......ఆనందవుటుగాది జరుపుకోవాలి.
" రసస్రవంతి "
" సాహితీ విరాట్ "
'వాజ్ఞ్మయ రత్నాకర '
7075505464
" కావ్యసుధ "
'వాజ్ఞ్మయ భూషణ'
'ఆధ్యాత్మిక సాహిత్య సామ్రాట్'
9247313488 : హైదరాబాదు

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి