ప్రియమైన వారి సమాగమం
తెచ్చే సంతోషంతో
కరిగి నీరైన మనసులా
లేత కిరణాల తాకిడికి
జారిపోతున్న మంచు ...
తొణికిన వెలుగు కలశపు
బంగారు కిరణాలు
తాకిన మేరా కనకమయం కాగా
కళకళలాడుతున్న అవని.
అపుడే విచ్చుకుంటున్న
లేత ఆకులపై ఆత్రంగా
ప్రేమలేఖలు రాసేసి
మెరిపిస్తున్న కాంతిరేఖలు
తుంటరిగా దారికి
అడ్డు వస్తున్న మబ్బులను
నవ్వుతూ దాటుకుంటూ
పైకెదుగుతున్న భానుబింబము
ప్రకృతి లోని ప్రతి అణువూ
వేకువ వెలుగుల అందాన్ని
ఆనందాన్ని అపురూపంగా
అనుభవిస్తున్న అపురూప దృశ్యం
దివిలో ఇంత రమణీయమైన
అందం ఉంటుందో లేదో
అనుసరిస్తే.....అనుభవిస్తే
భువి మీదే భూతలస్వర్గం
మనసు మురిపించే ఉదయానికి
🌸🌸 సుప్రభాతం 🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి