ఆకాశం వెలివేసింది!!!?; - ప్రతాప్ కౌటిళ్యా
దారి వెంట
చెట్లన్నీ
సిలువ వేయబడ్డా
క్రీస్తుల్లా నిలబడి ఉన్నాయి!!

భూమిపై నదులన్నీ
గుండెల్లో గుచ్చితే
ప్రవహిస్తున్న వెచ్చని
రక్తంలా ఉన్నాయి!!!

మనుషుల ముఖాలన్నీ
చెట్లపై రాలిపోతున్న
పువ్వుల్లా
విసిరి వేయబడుతున్నయి!!!

దూరంగా కురుస్తున్న 
మేఘాల్లా
వాళ్ల కళ్ళని కన్నీళ్ళని
రాలుస్తున్నవి!!

తిరిగిరాని లోకాలకు
వెళ్తున్నట్లు
సంధ్య పొద్దులు
మళ్లీ మళ్లీ వెనక్కి తిరిగి
చూస్తూ పోతున్నవి!!!

ఆకాశం మధ్యలో
ఇంద్రధనస్సు
గాయపడ్డ ఆమె మనసులో లా
ముసుగు తీసి మూలుగుతుంది!!!

ఎగురుతున్న పక్షుల్లా ఉన్నా
నక్షత్రాలన్నీ ఆవల ఎగిరే
అవకాశం లేక
ఆకాశానికి అతుక్కుపోయి ఉన్నాయి!!

అమ్మ ఇచ్చిన
రక్త మాంసాలకి
ఊపిరితో నింపిన
గాలి కవలలు
భూదేవికి ఉదయ సంధ్యలు!!?

పచ్చని ఆకు
బ్రతుక్కూ చిహ్నం!!

ఎర్రని రక్తం
సూర్య శంకంలో తీర్థం!!

ఆకుల్ని నమిలి
రక్తం త్రాగి
పులులు సింహాలకు పుట్టిన
మట్టి మనుషులు వీళ్లు!!?

ఆకాశం వెలివేసింది
సముద్రం ఒడ్డుకు చేర్చింది
రెక్కలు లేని ఎగిరే పక్షులు మానవులు!!
మళ్లీ మళ్లీ పుడతారు భూమిపై వీళ్లు!!!?

Pratapkoutilya lecturer in Bio-Chem palem nagarkurnool dist 🙏
District president Sri Sri kalavedika
8309529273

కామెంట్‌లు