పద్యాలు ; :- డా.గౌరవరాజు సతీష్ కుమార్.

 తే.గీ.
విలువనిచ్చేటి వలువలా విప్పివేసి
అర్ధనగ్న దేహాలతో యరుగుటేల?
బొట్టు గాజులు తీసేసి బోసిగాను
విధవ వేషమేసి ధరను వీగుటేల?
తే.గీ.
కాలిగజ్జెలు మెట్టెలు కానివంటు
పట్టుబట్టి బడాయితో పరుగులేల?
కుప్పె, జడగంట గతకాల గుర్తులంటు
బాబ్డు హేయిరు షోకని బరుగుటేల?
తే.గీ.
పుస్తెలూ కమ్మలూ తీసి బుగ్గిజేసి
బోడిమెడ చెవుల చెలగి బోవుటేల?
భరత దేశాన బుట్టిన భామవీవు
భరత మాతకు చెడుపేరు భావ్యమేన?
తే.గీ.
ఇతర దేశాల కాంతలు ఏగిరంత
భరత సంస్కృతి నెంతేని భక్తితోను 
అనుసరించ బరగిరహో అక్కజముగ
మదిని దలపోయుడీమాట మగువలార!!

కామెంట్‌లు