విజ్ఞానవంతులే... సైన్స్ పునాది వికారాబాద్ SAP కళాశాల retd ప్రిన్సిపల్ dr ముత్తారెడ్డి; - వెంకట్ :మొలక ప్రతినిధి
 ఎస్ ఎల్ బి లో ఘనంగా సైన్స్ డే
వికారాబాద్:
సమాజంలో విజ్ఞానవంతులే సైన్స్ కు పునాదులవుతారని ముత్తారెడ్డి అన్నారు. మంగళవారం జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగాSLB పాఠశాలలో సైన్స్ మేళా ప్రదర్శనలు నిర్వహించారు. జీవశాస్త్రం ప్రయోగాలు విజ్ఞాన ప్రపంచం తెలియజేసే అంశాలను విద్యార్థినిలు ప్రయోగశాలలో ప్రదర్శించారు. ప్రయోగశాలలను ప్రారంభించిన ముత్తారెడ్డి, ప్రిన్సిపల్ డాక్టర్ గోపిశెట్టి రమణమ్మ విద్యార్థినిల ప్రయోగాలను విజ్ఞానాంశాలను తిలకించి అభినందించారు. అనంతరం జరిగిన సమావేశంలో dr ముత్తారెడ్డి మాట్లాడుతూ సైన్స్ కు మూలాధారమైన థామస్ ఎడిసన్ చార్లెస్ డార్విన్ ల గురించి తెలియజేశారు. విజ్ఞాన ప్రపంచం విద్యార్థి దశ నుంచే పుట్టుకొస్తుందని, విద్యార్థి దశలోనే పరిశీలనకు అలవాటు చేసుకోవాలన్నారు. పరిశీలించే కొత్తదనమే విజ్ఞాన శాస్త్రము అని అన్నారు. వివిధ రకాల కథలను సందేశాలను తెలియజేసి ఆకర్షితులను చేశారు. సైన్స్ డే సందర్భంగా పాఠశాలలో నిర్వహించిన ఉపన్యాసం వ్యాసరచన, చిత్రలేఖనం, క్విజ్ తదితర పోటీల్లో విజేతలు అయిన విద్యార్థినిలకు ప్రశంసా పత్రాలు, మెడల్స్ బహుమతులు అందజేసి అభినందించారు. అనంతరం ముఖ్య అతిథులను ముత్తారెడ్డి రామలింగం ప్రిన్సిపల్లను సన్మానించి గౌరవించారు. ఇందులో సైన్స్ టీచర్లు నాగేష్, శ్వేత, రాజ్యలక్ష్మి, పాఠశాల సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు.


కామెంట్‌లు