వేమన చెప్పిన ప్రతి అక్షరం శ్రీకృష్ణ పరమాత్మ ప్రవచించిన భగవద్గీతకు సమానం వినురవేమ అనగానే వేమనను వినమని వేమన అంటున్నాడు తనను తాను తెలుసుకొని తానే బ్రహ్మస్వరూపమని అహం అన్నదాని స్వరూపాన్ని మన ముందు ఉంచాడు గీత కూడా శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పినది కాదని నరములతో నిర్మితమైన నరునికి తిరుగుతున్న నీటి నందించిన నారాయణుడు (నార +ఆయనుడు) చెప్పినదిగా నరుడైన నేను నారాయణుడైన నాతో చెప్పుకున్నదే గీత అన్న అర్థాన్ని వివరించారు. డా. వెంకట రాజు గారు అన్నట్లు వేమనను తక్కువగా అర్థం చేసుకునే వారు లేరని ఒకవేళ ఉంటే ఆ శబ్దాలకు అర్థాలు తెలియని వారే ఉంటారని చెప్పారు ఉదాహరణగా ఓ వేశ్య తన వదిన గారి ఆభరాణాలను అడిగి తీసుకువచ్చి తనకు అలంకరించమని కోరిందని వదిన గారినడగగా ఆభరణాలన్నీ ఇచ్చి ఓ విషయం అలంకరించేటప్పుడు ఆమెను బట్టలు లేకుండా వివస్త్రను చేసి ఫలానా స్థలాన్ని చూడమని ఆదేశించిందని కొన్ని నీచ ఉపమానాలతో వచ్చిన కథను వింటే తప్ప వారిపై చులకన అభిప్రాయం రాదు అయితే వదిన అంటే ఎవరు మాతృమూర్తి స్వరూపం ఓ అమ్మ తన కుమారునికి ఇంత నీచమైన పని చేయమని చెపుతుందా? ఆమె చెప్పిన శబ్దానికి అర్థం ఏమిటి ఈ పనికిమాలిన కాలయాపన చేసే బదులు కుండలిని స్వాధిన పరుచుకుని జీవితాన్ని స్వార్థకపరుచుకో. ప్రపంచానికి ఆదర్శంగా నిలిచి నాకు అన్నగారికి పేరు ప్రఖ్యాతులను తేవాలి అని చెప్పింది తప్ప వేరే అర్థాలను చెప్పే దుష్టులను ఈ ప్రపంచంలో ఎక్కడా ఉండరు ఉంటే ఆమె మాత్రమే తల్లి లేని వేమనకు తల్లిగా చంటి పిల్లను సాకిన మాతృమూర్తి వదిన గారు.
అసలు వాడు రాసిన పద్యాలలో మకుటానికి అర్థం విశ్వదాభిరామ వినురవేమ అనడంలోనే అద్భుతమైన వేదాంతం ఉన్నది అంటారు పెద్దలు విశ్వం అంటే సమస్తము అని ద అంటే ఇవ్వడమని అభిరామమంటే అవ్యక్తం నుంచి వ్యక్తం చేసిన వాడని అని చెబుతారు పెద్దలు దేని నుంచి దేనిని వ్యక్తం చేస్తున్నారు నిరాకారము నుంచి సకారమా నిరాకారము ఆకారము లేనిదా అవ్యక్తం వ్యక్తం కానిదా కాబడనిదా ఇవన్నీ మామూలు వారికి వచ్చే సందేహాలు దేహం ఉన్న ప్రతి వాడికి సందేహం తప్పక కలుగుతుంది కదా అది తీర్చేది ఎవరు తీర్చేవారు వలన వారి తీర్పును అంగీకరించి ఆమోదించే వారు ఎంతమంది మన తర్కం తప్ప అసలు సత్ పదార్థాన్ని విశ్లేషించే, వాడే మాటలు మనం ఎంతవరకు అంగీకరిస్తాం ఈనాటి యువత కనీసం వినడానికైనా చెవి ఒగ్గుతుందా అసలు వేమః అంటే మగ్గం మగ్గంతో సాలీడు ఎంత చక్కటి చిత్రాన్ని కళ్ళకు కడుతూ అల్లుతాడు ప్రపంచంలో ఏ క్రిమి కీటకాదులకు లేని అదృష్టం సాలి పురుగుకు మాత్రమే ఉంది. తనపై దురాక్రమణకు వచ్చి తనకు ప్రాణ హాని కల్పించే శత్రువులు వచ్చినప్పుడు తన పుస్టం నుంచి ఉద్భవించే దారం ద్వారా గాలిలో నిలబడుతుంది శత్రువులు లేరు అనుకున్న క్షణాన గాలిలో తేలాడుతున్న ఆ పురుగు దారాన్ని తన పుస్టంలో నుంచి తీసుకుంటూ పైకి వచ్చి తన నివాసంలో చిక్కుకుంటుంది దానికి ఇచ్చిన వరమా ఇది.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి