జననేత- వై.ఎస్.ఆర్ (14);- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 ఉదయం నుంచి ఎంత బిజీగా ఉన్నా రాత్రి ఇంటికి వచ్చాక మా సమయం మాకు ఉండేది మరో అద్భుతమైన విషయం ఎలాంటి ఒత్తిడి గాని బయటి పనులు పెంచి ఆందోళన చెందడం గానీ  ఆ రోజు  మాతో వ్యవహరించడం పై ఎలాంటి ప్రభావం చూపేవి కావు  ఈ సున్నితమైన విభజన రేఖను సదాపాటించేవాడు. ఆయన ఒక మంచి ఉపాధ్యాయుడు ఒక మంచి తండ్రి మంచి భర్త ఇవన్నీ ఆయనలో ఉన్న లక్షణాలు  జీవితంలో తన  నిర్వర్తించిన ఏ పాత్రలో చూసినా ఆయన ఒక రోల్ మోడల్ మనిషి. ఎలా ఉండాలి, మనిషికి ఎలాంటి క్యారెక్టర్ ఉండాలి అసలు క్యారెక్టర్ అంటే ఏమిటి  ఒకరికి మాట ఇచ్చిన తర్వాత దానికి ఎందుకు విలువ ఇవ్వాలి, ఆ విలువ ఎలా ఇవ్వాలి ఇవన్నీ పిల్లలకి చెపుతూ ఉండేవారు. ఆయనతో గడపగలిగే సమయం కోసం ఎదురు చూస్తూ ఉండేవాళ్ళం మేము.
ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన కుటుంబంలో ఒకడు కావడం మాకు దేవుడిచ్చినవరం  ఆయన కుటుంబం రాష్ట్రమంత పెద్దదిగా విస్తరించడం మా అందరికీ ఆ దేవుడు ప్రసాదించిన భాగ్యం. ఆయనకు చాలా విషయాల్లో కొన్ని నిర్దిష్టమైన పద్ధతులు విలువలు ఉండేది. ఎవరిని అనుమానించరు ఏదైనా సరే సూటిగా మొహం మీదే మాట్లాడేస్తారు. ఎవరి గురించి అయినా కంప్లైంట్స్ వచ్చినా దేవుడే చూసుకుంటాడు అని తేలిగ్గా తీసుకునే వారే తప్ప  తీవ్రంగా ప్రతి స్పందించేవాడు కాదు  ఆయన తర్కం విచక్షణ అపూర్వమైనవి  ఎంత కష్టమైనా సమస్యతో నైనా ఎవరైనా వచ్చి తనను ఆశ్రయిస్తే ఆయన చాలా సులువైన పరిష్కారాలను చూపించేవారు  ప్రజాసేవ పథంలో ఆయన తపన సతతం వ్యక్తం అవుతూనే ఉండేది. నిత్యం ఒక కొత్త ఆలోచనతో ముందుకు వెళ్లేవారు  కొత్త ఆలోచన కోసం పరితపించేవాడు ఉదయం చెప్పేది చేసేటప్పుడు కూడా ఒక చిన్న పుస్తకం రచన ఆలోచనలు అందులో రాసుకొని తర్వాత చర్చించుకునే కార్యరూపం ఇచ్చేవాడు.ఆయన చేపట్టిన ప్రజా సంక్షేమ కార్యక్రమాలను ఆ తపనలో నుంచి పుట్టినవే వాటి గురించి ప్రత్యేకంగా ప్రస్తావించవలసిన అవసరం లేదు  అయితే రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ తపన  హెచ్చింది  రెండవసారి ముఖ్యమంత్రి అంటే బాధ్యత రెట్టింపయినట్టుగానే ఆయన పాటించారు, భావించారు.  త్వరగా పూర్తి చేయాలని నిత్యం అంటుండేవారు. అదే సమయంలో ఎవరు ఎలాంటి సూచనలు ఇచ్చినా దానిని ఆలకించేవారు  మీడియాలో ఎప్పుడైనా ప్రభుత్వ వ్యతిరేక వార్తలు  ప్రజల ఇబ్బందులకు సంబంధించిన వ్యవస్థ మేము చూసి చెప్పేవాళ్లం వెంటనే అధికారులకు ఫోన్ చేసి  అసలు ఏం జరిగిందో కనుక్కోండి అంటూ పురమాయించేవారు  ఒక రకంగా మేము కూడా గవర్నమెంట్ లో భాగమవుతున్నామా అని అనిపిస్తూ ఉండేది అంటారు  విజయలక్ష్మి గారు.

కామెంట్‌లు