రెడ్ల పుట్టుక (2);- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322
 సాలి వృత్తి చేసే వ్యక్తి కూడా చీర గానీ, ధోవతి గానీ నేయడానికి ఉపక్రమించినప్పుడు దాని పొడుగు పేకలను సమంగా సరిచేసి  ఒక్కొక్క రంగు దారంతో విభిన్న పద్ధతుల్లో రకరకాల దుస్తులను మనకందిస్తారు. ఏ రంగు ఎక్కడ దేనికి అద్దాలో అక్కడ అంతవరకే పరిమితం చేసి కంటికి నదరుగా ఉండేలా తీర్చిదిద్దుతాడు. దేనిని ఇష్టపడతారో ఆ రంగులు మాత్రం ఎన్నుకొని దానిని కొని ప్రజలు ఆనందిస్తారు అలాగే వేమనామాత్యుడు తానని చెప్తూనే ద్వైత  స్థితి నుంచి అద్వైత స్థితికి తీసుకెళ్లే అద్భుతమైన రచనలు చేశాడు  మామూలు పరిచయాలను చదివినట్లు చదివితే మనకు లోతు తెలియదు అనుకున్నా ఆకాంక్ష ఉన్నవారికి అది గొప్ప విశేషంగానూ అనిపించదు.  సుఖదుఃఖాలు కష్టనష్టాలు ప్రేమ ఉపదేశాలు లాంటి దొంగలు మనకు కనిపిస్తున్నా వాటిని అర్థం చేసుకొని  శరీరాన్ని సైతం దానికి అలవాటు చేసి దొంగతనంగా నేను ఏదైతే మమ అహం శబ్దాలకు  బ్రహ్మ స్వరూపంగా నిలబడిందో దానిగా వేమన కనిపిస్తాడు. అందుకే పుట్టినప్పుడు గిట్టినప్పుడు లేని బట్ట  మధ్యలో కడితే అది నగుబాటు కాదా అని ప్రశ్నించాడు. ఏ జ్ఞానానికి మధ్య తెర పెట్టి ఎవరో ఒకరు కలిగిస్తాడో దాన్ని దాటి ప్రాత్నుడు ప్రజ్ఞానం కోసం తపిస్తాడు. లింగ భేదాన్ని విస్మరిస్తే దాన్ని ఆడబిడ్డ అంటాం స్త్రీ శిశువు అన్న భౌతికార్థాన్ని ప్రక్కన పెడితే  ఆడ యాడకు చేరాలో దాని ఆలోచన దాని గురించి ఏమని చెప్పాలి అని పేరు చెప్తాడు.  కొండవీడు తన ఊరుగా దానికి పడమర ప్రక్కన నేను ఉంటున్నాను నా భౌతికమైన దానిని అంతటి గొప్ప ప్రజా కవి పద్య రూపంలో వ్రాయనవసరం లేదు.
ఘనంగా స్థాణువుగా రాయిగా బండలా ఉన్న స్థితిని దాటి  స్పందన వైపు పయనిస్తే నీ శరీరంలో ఉంటుంది దాన్ని మొదటి ఇల్లుగా చేసుకున్నాడు ఆయన కనుకనే  అటు తారకమంత్రాన్ని ఇచ్చిన శ్రీరామచంద్రుని జ్యోతిని చూపించే కృష్ణ పరమాత్మను విష్ణు స్వరూపాన్ని విమర్శించగలిగాడు. బంగారపు మృగం ఉండదని రాముడికి తెలియదా వారి భార్య కోరిక మేరకు ఎందుకు పరిగెట్టవలసి వచ్చింది ఆ మాత్రం తెలియని వాడు భగవంతుడు ఎలా అయ్యాడు అని ప్రశ్నించిన వేమనను భౌతికత్వం లోనే పరిగణిస్తాము వారి ప్రశ్నకు తాత్విక అర్థం లేదా వేదాంతంలో ఆయన చెప్పిన మాటలు పండిత ప్రకాండులు మనకు విశదీకరించరేమి  తెలియకనా? తెలిసి చెప్పినా జీర్ణించుకోలేని శక్తిహీనుల మనా? పరమాత్మ ఏమిటి మరి అటు భోగాన్ని ఇటు యోగాన్ని సమపాళ్లలో అనుభవించిన ఆ ఉత్తమ మనీష కలిగిన వాడిని తెలుసుకోగలమా  ఉప్పు కప్పు రమన్న వేమన వ్రాసిన శబ్దానికి రుచికి క్రాంతికి భేదం ఏదో తెలుసుకోలేని అల్పజ్ఞులం.


కామెంట్‌లు