అభ్యుదయ మేధావి (2);- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.


 నేను విన్న ఈ విషయాన్ని నా మిత్రునితో చెప్పి యువ తరంలో ఆయన  శక్తి ఏమిటి  నిజంగా ఆయన  శక్తిమంతుడు అయితే వారిని గురించిన ఒక పుస్తకాన్ని కూడా నేను వ్రాయాలని  సంకల్పించాను  వారిని గురించి నాలుగు మాటలు నాకు చెప్పండి అని అడిగితే  నీవు పుస్తకంగా ప్రచురిస్తానని  అంటున్నావు కనుక  నేను చెప్పను కాదూ కూడదు అని చెప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తే  నేను చెప్పిన విషయాలను పుస్తకంలో ప్రచురించండి నాకు అభ్యంతరం లేదు  కానీ నా పేరు మాత్రం ఎక్కడా ప్రచురించకూడదు అని మాట తీసుకున్న తర్వాత అతను నాకన్నా వయసులో చాలా చిన్నవాడు  అమ్మవారి ఉపాసనతో గురువు ద్వారా వారు నేర్చుకున్న విద్య  సాధారణమైనది కాదు వారి కుటుంబాన్ని గురించి కూడా నాకు  తెలుసును అని వారి గురించి చెప్పడం ప్రారంభించారు. తమ్ముడు అంతర్యాన్ని ఆవిష్కరించడం అంత తేలికైన పని కాదు  జీవితంలో కష్టపడ్డ వాడికి ఆకలి విలువ తెలుసు వారికి ప్రపంచంలో ప్రతి జీవిలో పరమాత్మ కనిపిస్తాడు  తనలాంటి ఆత్మీయతే అక్కడా ఉన్నది దానిని గౌరవించాలి ఆ జీవికి ఓ పరమాశయమున్నదని దానిని నిర్వర్తించడానికి వచ్చాడని తెలుస్తోంది. ప్రకృతి దృష్టిలో అంతా సమానమే క్రిమి కీటకాలు నుంచి మానవ జన్మ వరకు ఏదీ హీనమైనది కాదు  దాని అవగాహన చేసుకున్న వాడు కనుకనే కారుణ్యమూర్తిగా  ఈ మధ్య తాను నటించిన సినిమాలో క్రీస్తు యేసుగా ఆ పాత్రకు పూర్తి న్యాయం చేశారు  మాటలో చూపులో నడవడికలో క్రీస్తు ఇలానే ఉంటాడా అని అనిపించడం సహజం  అలాగే తన సహధర్మచారిణి శ్రీమతి లక్ష్మి కూడా మరియ పాత్రలో జీవించింది. గురుముఖతః విద్య కలిపి వారి ఆశీస్సులతో వారి ఆశయాలకు ఆదర్శంగా జీవించే శిష్యునికి  గురు కటాక్షంతో వాక్సుద్ధి సిద్ధిస్తుంది  ఆ కరుణకు పాత్ర మయ్యాడు తమ్ముడు  అందుకు పెద్దవాడిగా అభినందిస్తున్నాను. ఇది అసిదారావ్రతం లాంటిది  హాస్యానికి కూడా ఎలాంటి అపశబ్దాలను వాడకూడదు నిష్ణాతుడైన వాడు కనుక ఆ విద్యను తన సొంతం చేసుకున్నాడు  తాను ఆకలి రుచి తెలిసినవాడు కనుక తన సమీపంలోని వారెవ్వరు ఆకలి బాధకు లోను కాకూడదని దంపతులిద్దరూ  అన్నప్రసాద వితరణతో జీవించడమే కాక పిల్లలు ఇద్దరినీ కూడా ఆ బాటలోనే నడపడానికి మార్గం చూపారు వారిద్దరూ తల్లిదండ్రుల చెప్పు చేతుల్లో ఉండడం వీరి సంచిత జన్మ సుకృతం.


కామెంట్‌లు