జననేత- వై.ఎస్.ఆర్( 23)- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322
 విద్యార్హతలు ఉండి పూర్తి నైపుణ్యత లోపించిన కారణంగా ఉద్యోగాలు పొందలేకపోతున్న యువతకు ఉచితంగా  ఉపాధి రంగాలకు అవసరమైన శిక్షణ ఇచ్చి వారికి ఉపాధి మార్గాలను కల్పించే ఉద్దేశంతో ప్రవేశపెట్టినది  రాజీవ్ ఉద్యోగ శ్రీ పథకం  ప్రతి గ్రామానికి కనీసం 10 ఉద్యోగాలను కల్పించే విధంగా రానున్న రెండు నెలలు 10 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం  రాష్ట్రవ్యాప్తంగా 217 పారిశ్రామిక వాడలలో ఉన్న లక్ష 48 వేల  చిన్న తరహా పరిశ్రమలకు కనీసం ఒక్కోదానికి ఇద్దరు లేదా ముగ్గురు ఉద్యోగుల అవసరం ఉండగా మొత్తం నాలుగు లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. రాష్ట్ర రాజధాని దాని చుట్టూ ఉన్న రంగారెడ్డి నల్గొండ మెదక్ జిల్లాలోని  27 పారిశ్రామిక వాడల్లో 40 వేల చిన్న తరహా పరిశ్రమలు ఉన్నాయి. వీటికి రెండు లక్షల 80 వేల ఉద్యోగులు  అవసరం వివేక సాప్ట్ వేర్ బయోటెక్నాలజీ నిర్మాణరంగం రిటైలింగ్ టూరిజం వంటి రంగాలలో  ఎంతోమంది ఉద్యోగుల అవసరం ఉంది  అదే సమయంలో ఇటు ఉద్యోగా అర్హులుగా ఉన్నారు  అయితే వీరి విద్య అర్హతకు చేయవలసిన పనికి సంబంధం లేని కారణంగా అటు సంస్థలకు ఉద్యోగులు కరువయ్యారు  ఇటు యువత ఉద్యోగాలను అందుకోలేకపోతున్నారు సరిగ్గా ఈ అంతరాన్ని పూరించి ఇది యువతకు ఆయా రంగాలకు సంబంధించిన అంశాలలో శిక్షణ ఇచ్చి  తద్వారా ఉపాధి అవకాశాన్ని కల్పిస్తూ అటు ఆయా సంస్థలకు అర్హులైన ఉద్యోగులను అందిస్తూ  దిగ్విజయంగా అమలవుతోంది  రాజీవ్ ఉద్యోగ శ్రీ  పథకం  అసలు ఈ పథకం యొక్క ఉద్దేశాలు ఏమిటో తెలుసుకుందాం.నిరుద్యోగుల తరఫున ప్రభుత్వానికి సంస్థలకు ముఖ్యంగా ప్రైవేట్ సంస్థలకు వచ్చే వారధిగా నిలబడి యువతకు ఉద్యోగాలను కల్పించడం  రానున్న రెండేళ్లలో పది లక్షల మందికి ఉద్యోగ అవకాశాలను అందించడం ఇందులో ఐదు లక్షల మందికి సాఫ్ట్వేర్ మరియు దాని అనుబంధ రంగాలలో ఉన్నత స్థాయి ఉద్యోగాలను అందించడం  మరో ఐదు లక్షల మందికి కనీసం ఐదువేల రూపాయల నెల జీతం గల ఉద్యోగాల కల్పన  ఉపాధి కల్పనా రంగాలలోని శాఖలకు ఉపాధి అవకాశాలను సృష్టించడంలో ఆచరించవలసిన ప్రణాళికలను కార్యక్రమాలను రూపొందించడం  ఉద్యోగస్తులకు అవసరమైన శిక్షణ విషయాలపై సలహాలు ఇవ్వడమే కాకుండా సరైన స్థానాలలో  వారిని భర్తీ చేయడం.


కామెంట్‌లు