జననేత వై.ఎస్.ఆర్ (24);- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9493811322
 రాష్ట్రంలోనే కాక ఇతర రాష్ట్రాలు విదేశాలలో సైతం ఉపాధి అవసరమైన మార్కెట్ డిమాండ్కు అనుకూలమైన  ప్రత్యేక శిక్షణను ఇచ్చి యువతకు ఉత్తమ అవకాశాలను కలిగించడం  జాతీయ అంతర్జాతీయ ఆర్థిక ఎదుగుదలలో మానవ వనరుల భాగస్వామ్యాన్ని పెంచడం  యువతకు వృత్తి నైపుణ్యాలు శిక్షణ ఇచ్చేందుకు రాష్ట్రవ్యాప్తంగా 55 ప్రత్యేక శిక్షణ  సంస్థలు  రాజీవ్ ఉద్యోగ శ్రీ పథకంలో భాగంగా పనిచేస్తున్నాయి అన్ని యూనివర్సిటీలకు ఎప్పటికప్పుడు యువతకు అవసరమైన సమాచారాన్ని అందిస్తున్నారు  రాజీవ్ ఉద్యోగ శ్రీ పథకం పై అవగాహన కల్పించేందుకు కాకుండా ఉద్యోగ మేళాలు  శిక్షణ సంస్థలు ఉద్యోగ సంస్థలు సమాచారాలనుంచేందుకు వీలుగా  రాజీవ్ ఉద్యోగ  శ్రీ పోస్టర్లను 25 జూలై 2008 ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ఆర్ రెడ్డి ప్రారంభించారు.
ఉద్యోగం కోరుకుంటున్న అభ్యర్థులు ఈ వెబ్సైట్లో తమ పేరు నమోదు చేసుకోవచ్చు. కనీసం ఐదో తరగతి చదివిన వారంతా వారి పేరును రిజిస్టర్ చేసుకోవచ్చు  అర్హులైన ఉద్యోగులను  కావాలనుకున్న సంస్థలు కూడా ఈ వెబ్సైట్లో తమ సంస్థ పేరు నమోదు చేయడంతో పాటు ఉద్యోగ సమాచారాన్ని కూడా ఉంచవచ్చు  వివిధ శిక్షణ సంస్థలు చేసే కోర్సుల వివరాలు ఈ వెబ్సైట్లో పొందుపరిచారు కాబట్టి అభ్యర్థులు వారికి ఇష్టమైన రంగంలో అవసరమైన శిక్షణ పొందడంతో పాటు ఉద్యోగాలు కూడా సంపాదించుకోవచ్చు  అశేష జనావళి తమ హృదయాలలో గుడి కట్టి ప్రతిష్టించుకున్న అపురూపంలో డాక్టర్ వైఎస్ రూపం  ఆంధ్రుల హృదయాలలో శాశ్వతంగా ముద్రపడిన ఒక సముచిత చిత్తరువు డాక్టర్ వైఎస్ రూపం
ప్రజాభిమానం అనే కడలి కెరటాలపై ఉల్లాసంగా ఊరేగిన ఒక ప్రియతమ నేత డాక్టర్ వైఎస్  రాష్ట్ర ముఖ్యమంత్రిగా జనం గుండెల్లో మార్గంలో ఒక గంభీర గళం ఒక ఆత్మీయ స్వరం డాక్టర్ వైఎస్  పాలనా ప్రవాహంతో పాటు పరుగులు తీసే పరిపాలన అధ్యక్షుడు కార్యదక్షుడు  డాక్టర్ వైయస్ 1500 కిలో మీటర్ల పొడవు నా పాదయాత్ర చేసి సామాన్యుల గుండె ఘోషను అతి దగ్గరగా విన్న జాలి గుండె. పేదల చెంత చేరి వారి కన్నీళ్లు తుడిచి ఓదార్చే ప్రేమమయ హస్తం  చితికిపోయిన రైతుల బ్రతుకుల్లో కొత్త జీవశక్తి ని నింపాలని  ఆడపడుచుల జీవితాలకు అభయ హస్తం చాచి అండదండగా నిలవాలని పేదలకు ఆరోగ్య సాధనాలను అందుబాటులోకి తేవాలని తలచిన నిండు మనసు  అందమైన స్వచ్ఛమైన పరిపాలనను అందించగలిగిన తెల్లని పంచ చొక్కాతో ధవళ వస్త్రధారణ ఏ ముఖ్యమంత్రికి లేని చరిత్ర సృష్టించిన గంభీరమైననడక.

.

కామెంట్‌లు