కృష్ణా రెడ్డి ప్రయత్నం (5);- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322
 దీనివల్ల ఒకే గ్రంథం పలు విధాల ప్రచారంలో ఉండేది. ఎలా ప్రచారంలో ఉన్నా తాళపత్ర గ్రంథాలైనా అందరికీ అందుబాటులో ఉన్నాయా అంటే అదీ లేదు  సాహిత్యాన్ని సరైన రీతిలో భద్రపరచుకోవడం తెలియకపోవడం వల్ల వివిధ ప్రపంచాల కావ్యాలు ఇప్పుడు మచ్చుకు కూడా కనపడకుండా పోయినాయి  అంతెందుకు అచ్చు వచ్చిన తర్వాత 19వ శతాబ్దం చివర్లో ముద్రితమైన గ్రంథాల ప్రతులు ఎక్కడా లేకుండా పోయినాయి  అయితే విదేశాల్లోని లైబ్రరీలలో కొన్ని పరిధిలో ఉన్నాయి తమ చరిత్ర మీద తమకే సరైన అవగాహణ లేకపోవడం ఇందుకు కారణం  కోస్తాలో ప్రజల కోసం మొట్టమొదటి గ్రంథాలయాన్ని తెరిచిన వాడు థామస్ అనే ఆంగ్లేయుడు  ఈయన 1838 ప్రాంతంలో రాజమండ్రిలో ఒక ప్రజాగ్రంథాలయాన్ని నెలకొల్పారు. ఈ గ్రంథాలయానికి వృత్తాంతి  అనే తెలుగు పత్రిక కూడా  వచ్చేదని తెలుస్తోంది  ఈ గ్రంథాలయంలో చదువుకోడానికి ప్రజలు బారులుగా నిలబడే వాడని ఇందులో చదువుకోడానికి నేలపై చక్కగా ఏర్పాటు చేశారని  ఆ తెల్ల దొర థామస్ భార్య రాసిన ఉత్తరాల వల్ల తెలుస్తోంది  ఆధునిక కాలంలో తెలుగు  వాళ్లలో గ్రంథ పాలకులుగా వ్యవహరించిన అతి కొద్ది మందిలో ఒకరు అయోధ్యా పురం కృష్ణారెడ్డి  కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న తెలుగు బాషకు బ్రౌన్ జీవం పోయగా ఆ దీపం ఆరకుండా అందరికీ వెలుగునిచ్చేలా చూశాడు  కృష్ణారెడ్డి.  1817లో ఇండియాకు వచ్చిన బ్రౌన్ ద్వారా 1827న  తొలిసారిగా కడప కలెక్టర్ కు అసిస్టెంట్ గా నియమితులయ్యారు  దాదాపు అదే కాలంలో అయోధ్యా పురం కృష్ణారెడ్డితో బ్రౌన్ వరకు పరిచయం ఏర్పడింది.

ఆ తర్వాతే వీళ్ళిద్దరూ పరిచయం వాళ్లకే గార్డెన్ గా తెలుగు భాషకు తెలుగు ప్రజలకు వన్నె తెచ్చి పెట్టింది  బ్రౌన్ ద్వారా తెలుగు భాష అధ్యయనానికి పురికొల్పి అండగా నిలిచిన వ్యక్తి ఆయన  తెలుగు భాష అధ్యయనానికి కృష్ణారెడ్డి సహకారం పై తన వస్త్రాలలో ప్రత్యేకంగా ప్రస్తావించాడు  ఈ విషయంపై భంగోరే వెలుగులోకి తెచ్చిన బ్రౌన్ ఆయన లేఖలలో కూడా వివరాలు ఉన్నాయి  ఆంధ్రదేశం అంతటా తిరిగి ఆనాటి నైజంలోని గద్వాల్ లోని పండితులను పామరులను సైతం సంప్రదించి   కూర్చినవన్నీ పాత సంచికలలోనే నిలిచిపోవడం శోచనీయం  సిపి బ్రౌన్  తాళపత్ర గ్రంథాల సేకరణలో భాగంగా గద్వాల రాజా సీతారాం భూపాల సంప్రదించారు  తన సేకరించిన విలువైన వందలాది గ్రంథాలను ఇవ్వడమే కాక రాజా సీతారాం భూపాల్  తన సంస్థలోని పండితులను కడపకు పంపించారు  పుస్తకాలను తరలించే విషయంలో బాధ్యత స్వీకరించింది కృష్ణారెడ్డే. ఈ మేరకు గద్వాల రాజాతో సంప్రదింపులు జరిపాడు అయోధ్యాపురం కృష్ణారెడ్డి.
కామెంట్‌లు